తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2023 బుధవారం (మే 10) విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా చెక్ చేసుకోవచ్చు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 4,94,620 మంది విద్యార్థులు హాజరయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 544 పరీక్ష కేంద్రాల్లో ప్రతి రోజూ 1.59 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 90 శాతం మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.