TS Polycet 2023 Results: తెలంగాణ పాలీసెట్-2023 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి..

|

May 26, 2023 | 11:45 AM

తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2023) పరీక్ష ఫలితాలు శుక్రవారం (మే 26) విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ (ఎస్‌బీటీఈటీ) కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన..

TS Polycet 2023 Results: తెలంగాణ పాలీసెట్-2023 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి..
TS Polycet 2023 Results
Follow us on

తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2023) పరీక్ష ఫలితాలు శుక్రవారం (మే 26) విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ (ఎస్‌బీటీఈటీ) కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ విడుదల చేశారు. 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షలు ముగిసిన ఎనిమిది రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడం విశేషం. పరీక్షకు హాజరైన విద్యార్ధులు టీవీ9 వెబ్‌సైట్ లో నేరుగా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. తాజా ఫలితాల్లో86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు.

తెలంగాణ పాలీసెట్-2023 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాగా ప్రవేశ పరీక్ష మొత్తం 296 పరీక్ష కేంద్రాల్లో మే 17న ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తంగా 1,05,656 మంది ఈ ప‌రీక్షకు హాజ‌రు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అబ్బాయిలు 58,468 మంది, అమ్మాయిలు 47,188 మంది ఉన్నారు. మొత్తం 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు.  పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ త్వరలో విడుదలకానుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.