Telangana Congress: కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే లేఖ ప్రకంపనలు.. తప్పులేదంటున్న సీనియర్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

| Edited By: Shiva Prajapati

Dec 28, 2021 | 3:28 PM

Telangana Congress: కాంగ్రెస్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. నేరుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

Telangana Congress: కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే లేఖ ప్రకంపనలు.. తప్పులేదంటున్న సీనియర్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Congress
Follow us on

Telangana Congress: కాంగ్రెస్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. నేరుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పీసీసీ చీఫ్ ను మార్చడం లేదా ఆయన మైండ్ సెట్ మార్చాలంటూ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ లో ఫిర్యాదులు కామన్ అయినా.. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ పార్టీ లో చర్చనీయాంశంగా మారింది. నేరుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును ప్రశ్నిస్తూ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు ఆయన లేఖ రాశారు. తన స్వంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ తరపున రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రకటించడంతో పాటు రేవంత్ రెడ్డి స్వయంగా హాజరవుతానని కూడా ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమం విషయంలో మాట మాత్రమైనా తనకు చెప్పలేదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జగ్గారెడ్డి తన లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి.. పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం లేదని కేవలం స్వంత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు. రచ్చబండ అంశం కూడా పార్టీలో చర్చించకుండా స్వంతంగా తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారని విమర్శించారు. సీనియర్లతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారని.. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని వివరించారు. అంతేకాదు పార్టీ బలోపేతం అంశాన్ని పక్కన పెట్టి.. పార్టీని కార్పొరేట్ కంపెనీ మాదిరిగా నడిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలను లేఖలో పొందుపరిచారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేఖ విషయాన్ని సీనియర్లు సైతం సమర్థిస్తున్నారు. జగ్గారెడ్డి ఆవేదనలో తప్పు లేదంటున్నారు. తన స్వంత జిల్లా వెళ్తూ సమాచారం ఇవ్వకపోతే ఎలా అని వీహెచ్ వంటి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కార్యక్రమం తీసుకుంటే పీఏసీ లో చర్చించి ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు జరిగిన తప్పులన్ని సరిదిద్దుకొని ముందడుగు వేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు. మొత్తం మీద జగ్గారెడ్డి లేఖ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కొంత సీనియర్లు సైతం జగ్గారెడ్డి కి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది వేచి చూడాలి.

Also read:

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రభుత్వ పథకాలు అందనీయడం లేదంటూ వ్యక్తి ఆత్మహత్య..

Allu Arjun: ఎమోషనల్ అయిన అల్లు అర్జున్.. బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం