Telangana: గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌.. వివరణ ఇవ్వాలంటూ అధికారులకు నోటీసులు..

|

May 25, 2023 | 5:08 PM

Telangana High Court: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లను తెలంగాణ‌ హైకోర్టు కొట్టేసింది. జూన్‌ 11న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌సీఎస్‌సీ) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో దాఖ‌లైన‌..

Telangana: గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌.. వివరణ ఇవ్వాలంటూ అధికారులకు నోటీసులు..
Ts High Court On Group 1 Exam
Follow us on

Telangana High Court: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లను తెలంగాణ‌ హైకోర్టు కొట్టేసింది. జూన్‌ 11న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌సీఎస్‌సీ) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో దాఖ‌లైన‌ రిట్‌ పిటిషన్‌పై గురువారం విచార‌ణ జ‌రిగింది. అయితే ఈ రోజు ఉద‌య‌మే విచార‌ణ‌కు వ‌చ్చిన ఈ పిటిష‌న్‌పై.. తన కుమార్తె కూడా గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాసినందున తాను విచారించ‌లేన‌ని జ‌స్టిస్ కే ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. దీంతో పిటిష‌న్‌ను మ‌ధ్యాహ్నం మ‌రో బెంచ్‌కు పంపిస్తాన‌ని ఆయన వివ‌రించారు. ఈ క్రమంలో మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టి.. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిధిలోని వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత పరీక్షల మధ్య కనీసం 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను అమలు చేయకుండా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణకు టీఎస్‌సీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని 36 మంది అభ్యర్థులు ఆ పిటిషన్‌లో పేరొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్డు స్టే విధించేందుకు నిరాకరించింది. మరోవైపు నోటిఫికేషన్లు జారీ విషయంలో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని టీఎస్‌సీఎస్‌సీ చైర్మ‌న్, కార్య‌ద‌ర్శి, హోం శాఖ కార్య‌ద‌ర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది కోర్టు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.