AP vs Telangana: విద్యుత్ బకాయిల పంచాయతీలో తెలంగాణకు భారీ ఊరట.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏంటంటే?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య పవర్‌ పంచాయితీ నడుస్తోంది. తెలంగాణ తమకు విద్యుత్‌ ఛార్జీలు బకాయి పడిందంటూ ఏపీ ఫిర్యాదు చేయడంతో ఇటీవలే కేంద్రం కీలక ఉత్తర్వులిచ్చింది.

AP vs Telangana: విద్యుత్ బకాయిల పంచాయతీలో తెలంగాణకు భారీ ఊరట.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏంటంటే?
Telangana High Court
Follow us
Basha Shek

|

Updated on: Sep 29, 2022 | 7:02 AM

తెలుగు రాష్ట్రాల పవర్‌ పంచాయితీ మరో మలుపు తిరిగింది. ఏపీకి విద్యుత్‌ బకాయిల చెల్లింపుల విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది. ఏపీకి తక్షణమే 6లక్షల 995కోట్ల రూపాయలను చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య పవర్‌ పంచాయితీ నడుస్తోంది. తెలంగాణ తమకు విద్యుత్‌ ఛార్జీలు బకాయి పడిందంటూ ఏపీ ఫిర్యాదు చేయడంతో ఇటీవలే కేంద్రం కీలక ఉత్తర్వులిచ్చింది. ఏపీ వాదనతో ఏకీభవించిన కేంద్రం, అసలు.. 3వేల 315కోట్లతోపాటు లేట్‌ పేమెంట్‌ సర్‌ ఛార్జీ కింద మరో 3వేల 315కోట్లు కలిపి, మొత్తం 6లక్షల 995కోట్ల రూపాయలను ఏపీకి చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 30రోజుల్లోగా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ. గడువు దగ్గర పడటంతో హైకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్‌.

ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచే.. తెలంగాణకు 12వేల 490కోట్ల రూపాయలు రావాలంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రం తమ వాదనను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది.దీంతో కేంద్రం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. విద్యుత్‌ బకాయిల అంశం తేలేవరకూ తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రాన్ని ఆదేశించింది. సేమ్‌టైమ్‌, పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది హైకోర్టు. తాజా హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట లభించినట్లయింది. అదే సమయంలో ఈ బకాయిలు వస్తాయని అనుకుంటున్న ఏపీ సర్కార్‌కు మాత్రం షాక్‌ తగిలినట్లయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..