AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Buying case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందుతులకు ఊరట.. ప్రతి సోమవారం సిట్‌ ఎదుట హాజరుకావాలన్న కోర్టు..

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితులకు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది.

MLA Buying case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందుతులకు ఊరట.. ప్రతి సోమవారం సిట్‌ ఎదుట హాజరుకావాలన్న కోర్టు..
TRS MLAs Poaching Case
Sanjay Kasula
|

Updated on: Dec 01, 2022 | 12:21 PM

Share

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందుతులకు ఊరట లభించింది. నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌కు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. ప్రతి సోమవారం సిట్‌ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేయాలని తెలిపింది.

షాకింగ్‌ ఇన్ఫర్మేషన్‌తో హైకోర్టులో కౌంటర్‌ ఫైల్‌ చేసింది సిట్‌. ఇప్పటివరకు బయటకురాని కొత్త పేర్లను రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. సిట్‌ రిపోర్ట్‌లో కీలక నేతల పేర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, నిందితులతో అనుమానితులు మాట్లాడిన ఫోన్‌కాల్‌ డేటాను కోర్టుకు సమర్పించింది సిట్‌. ఆ కీలక నేతలతో నిందితులు దిగిన ఫొటోలు, కలిసి ప్రయాణించిన ఫ్లైట్స్‌ టికెట్స్‌ డీటైల్స్‌ను కూడా సబ్‌మిట్‌ చేసింది దర్యాప్తు బృందం.

ఎమ్మెల్యేలకు ఎరలో ఎవరి పాత్ర ఏంటో నిగ్గుతేల్చేందుకు కీలక ఆధారాలు సేకరించింది సిట్‌. మెయిన్‌గా బీజేపీ ముఖ్యనేత బీఎల్‌ సంతోష్‌, రామచంద్రభారతి మధ్య జరిగిన చాటింగ్‌ను రిపోర్ట్‌లో ప్రస్తావించింది. రామచంద్రభారతి నుంచి బీఎల్‌ సంతోష్‌కు ఐదు మెసేజ్‌లు వెళ్లినట్టు స్క్రీన్‌షాట్‌లు సబ్‌మిట్‌ చేసింది. రామచంద్రభారతి మెసేజ్‌లకు రియాక్టైన బీఎల్‌ సంతోష్‌… బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతానంటూ రిప్లై ఇచ్చారు. వీళ్లిద్దరి మధ్య సాగిన చాటింగ్‌లో ఏకే సింగ్‌, వాసిత్ పేర్లను గుర్తించింది సిట్‌. ఈ చాటింగ్‌ మొత్తాన్ని కోర్టుకు అందజేశారు అధికారులు.

ఇక, ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న నిందితుల పిటిషన్‌పై హైవోల్టేజ్‌ ఆర్గ్యుమెంట్స్‌ జరిగాయ్‌. ఎమ్మెల్యేలకు ఎర వెనక కేంద్రం కుట్ర ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే టార్గెట్‌గా ఈ తతంగమంతా జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సిట్‌ ఇన్వెస్టిగేషన్‌ ట్రాన్స్‌పరెంట్‌గా జరగడం లేదన్నారు నిందితుల తరపు న్యాయవాది. స్టేట్‌ గవర్నమెంట్‌ కనుసన్నల్లో, రాజకీయ కోణంలో దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే, కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నామని వాదనలు వినిపించారు. హైవోల్టేజ్‌ ఆర్గ్యుమెంట్స్‌తో కోర్టు హాల్‌ హీటెక్కిపోయింది. ఒకానొక టైమ్‌లో ఇరువర్గాలు లక్ష్మణ రేఖ దాటడంతో మర్యాద పాటించాలంటూ హెచ్చరించారు సీజే. ప్రిలిమినరీ ఆర్గ్యుమెంట్స్‌ తర్వాత నెక్ట్స్‌ హియరింగ్‌ను డిసెంబర్‌ ఆరుకి వాయిదా వేసింది హైకోర్టు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం