తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్ 2023) ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మే 8 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య శ్రీరాం వెంకటేశ్ ప్రకటించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మర్చి 2 నుంచి ప్రారంభంకాగా మే 5వ తేదీతో ముగియనుంది. విద్యార్ధుల అభ్యర్ధనల మేరకు ఎటువంటి ఆలస్య రుసుములేకుండా దరఖాస్తు గడువును పొడిగిస్తూ తాజాగా ప్రకటించించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ విద్యార్ధులు రూ.500, ఇతరులు రూ.900లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
రూ.500 ఆలస్యం రుసుంతో మే 8వ తేదీ వరకు, రూ.2,500ల ఆలస్య రుసుముతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మే15 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పాలిటెక్నిక్, బీఎస్‌సీ మ్యాథ్స్ పూర్తిచేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీలో ప్రవేశాలకు ప్రతి యేటా ఈసెట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.