Telangana Govt: విద్యార్థులూ బీ అలర్ట్.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం..

|

May 24, 2021 | 8:15 PM

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించారు.

Telangana Govt: విద్యార్థులూ బీ అలర్ట్.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం..
Follow us on

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ-సెట్ దరఖాస్తుకు గడువు నేటితో ముగిసిన నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దరఖాస్తు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు తెలంగాణ ఈ-సెట్ కన్వీనర్ వెంకటరమణా రెడ్డి తెలిపారు. కాగా వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ-సెట్ దరఖాస్తుకు గడువు మే 18వ తేదీ వరకు మాత్రమే ఇచ్చారు. ఆ తరువాత గడువును 24వ తేదీకి పెంచారు. ఇప్పుడు మరోసారి పెంచుతూ విద్యార్థులుు ఈ నెల 31వ తేదీ వరకు ఈ సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 800 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 400 గా ఉంది. ఈ-సెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ecet.tsche.ac.in ని సంప్రదించవచ్చు.

కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా విద్యార్థులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అదీకాకుండా ఆన్‌లైన్ అప్లై కావడంతో ఇంటర్నెట్ షాపులు సైతం 10 గంటల వరకే తెరిచి ఉంచేందుకు అవకాశం ఉండటంతో విద్యార్థులందరూ అప్లయ్ చేసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సెట్ దరఖాస్తుకు గడువు పెంచాల్సిందిగా పలువురు నుంచి ప్రభుత్వానికి అభ్యర్థనలు అందినట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్, విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. దరఖాస్తు గడువును పెంచుతూ ప్రకటించారు.

Also read:

Telangana Inter Exams: జూన్ నెలాఖ‌రులో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు.? కుద‌ర‌ని నేపథ్యంలో.. ప్ర‌త్యామ్నాయ మార్గం..

Anandaiah Natu Mandu: మ‌రో సెన్సేష‌న్… కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందుపై హైకోర్టులో పిటిషన్

Meteor Showers: భూమిపై ఉల్కాపాతాన్ని కలిగించే 4 వేల సంవత్సరాల పురాతన తోకచుక్కలు.. తాజా అధ్యయనంలో వెల్లడి