AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: యూపీ లాగే వారి ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చేస్తాం.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, క్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేస్తే..

Bandi Sanjay: యూపీ లాగే వారి ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చేస్తాం.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay
Shaik Madar Saheb
|

Updated on: Mar 01, 2023 | 3:55 PM

Share

తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, క్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేస్తే తెలంగాణలో మాత్రం ప్రాణాలు తీస్తున్నారంటూ విమర్శించారు. తాము అధికారం లోకి వచ్చాక ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ల ఇళ్లను యూపీ లాగే బుల్‌డోజర్లతో కూల్చేస్తామని ప్రకటించారు బండి సంజయ్‌. బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో ప్రసంగించిన బండి సంజయ్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. అసలు హోం మంత్రి ఉన్నారా.. లేరా? అంటూ ప్రశ్నించారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి ఇళ్లను బుల్డోజర్స్‌తో కూల్చుతామని బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటామన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కన్నెత్తి చూడాలంటే ఆకతాయిలు వణకాలని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే బీజేపీ మహిళా విభాగం బలంగా ఉందన్నారు.

బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని.. మద్యాన్ని నియంత్రిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని పేర్కొన్న సంజయ్.. ఇప్పటివరకూ కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలంటూ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!