కొవిడ్ పాజిటివ్ అని తేలితే అడుగుపెట్టొద్దు ప్లీజ్..

ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. కరోనా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో జ‌రుగ‌బోతున్న ఈ సమావేశాలకు శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలు మార్గదర్శకాలు నిర్దేశించారు.

కొవిడ్ పాజిటివ్ అని తేలితే అడుగుపెట్టొద్దు ప్లీజ్..

Updated on: Sep 04, 2020 | 6:56 PM

ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. కరోనా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో జ‌రుగ‌బోతున్న ఈ సమావేశాలకు శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలు మార్గదర్శకాలు నిర్దేశించారు. సభ్యులకు మాస్కు ఉంటేనే స‌భ‌లోకి అనుమ‌తి ఉంటుంద‌ని తేల్చిచెప్పారు. జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు ఉంటే అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి అనుమ‌తించరన్నారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగా ఉంటేనే అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, మంత్రుల పీఎస్‌లు, పీఏలు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలన్నారు. కొవిడ్ పాజిటివ్ తేలితే అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి రావొద్ద‌ని స్పీక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఎమ్మెల్యేల పీఏల‌ను అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి అనుమ‌తించ‌రని చెప్పారు. స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారులు, పోలీసుల‌తో చ‌ర్చించామ‌ని పేర్కొన్నారు.