Trs vs Bjp: తెలంగాణలో ఆసక్తికర రాజకీయం.. బీజేపీ తప్పటడుగులు, స్పీడ్ పెంచుతున్న టీఆర్ఎస్‌..

|

Feb 10, 2022 | 8:34 PM

Trs vs Bjp: రాజకీయ సమరంలో ప్రత్యర్థుల తప్పటడుగులు కూడా విలువైన అస్త్రాలుగా మారుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కూడా అలాగే ఉంది.

Trs vs Bjp: తెలంగాణలో ఆసక్తికర రాజకీయం.. బీజేపీ తప్పటడుగులు, స్పీడ్ పెంచుతున్న టీఆర్ఎస్‌..
Bjp Vs Trs
Follow us on

Trs vs Bjp: రాజకీయ సమరంలో ప్రత్యర్థుల తప్పటడుగులు కూడా విలువైన అస్త్రాలుగా మారుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాక మీదున్న టీఆర్ఎస్ కు బీజేపీనే లీడ్ ఇస్తున్నట్లుగా తయారైంది పరిస్థితి. బీజేపీ చేస్తున్న ప్రతి చర్యను టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది.

బీజేపీపై ఢిల్లీ స్థాయిలో పోరాటానికి దిగిన కేసీఆర్.. అంతే స్థాయిలో తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. బీజేపీ ఒక మాట అంటే పది మాటలు అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. వార్ సీరియస్ గా మారి ఒకరిపై ఒకరు పోరాటాలు మొదలుపెట్టారు. ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మరోసారి ఉద్యమ కాలాన్ని గుర్తుకు తెస్తుంది. అయితే టీఆర్ఎస్ చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలకు లీడ్ ఇచ్చింది మాత్రం బీజేపీనే. బీజేపీ జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రయోజనాల కోసం వ్యాఖ్యలు చేస్తున్నా, అందులో తెలంగాణకు ఏమాత్రం వ్యతిరేకంగా ఉన్నా ఫైర్ స్టార్ట్ చేస్తుంది టీఆర్ఎస్. సింగరేణి బొగ్గు గనుల వేలం టీఆర్ఎస్ కి కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తుంది. 17 నియోజకవర్గాల్లో పట్టున్న సింగరేణి కార్మికుల పక్షాన పోరాడుతూ ఆయా జిల్లాల్లో బీజేపీకి గండికొట్టే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది. ఇక పార్లమెంటులో విభజన సక్రమంగా జరగలేదన్న మోడీ వ్యాఖ్యల పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసింది. కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ ఇష్యూని కూడా ట్విట్టర్ వేదికగా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు కేటీఆర్, కవితలు.

రామానుజ విగ్రహావిష్కరణకి వచ్చిన ప్రధాని మోడీ కి ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అంటూ నిరసన తెలిపారు. ట్విట్టర్ లోనూ ఇదే అంశాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ట్రెండింగ్లో తీసుకొచ్చారు. ఇలా బీజేపీ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తమ నిరసనలకు అనుకూలంగా మార్చుకుంటుంది టీఆర్ఎస్. ఇందులో కొన్ని బీజేపీ చేస్తున్న తప్పటడుగులు అయితే.. మరికొన్ని ఆ పార్టీ జాతీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో వస్తున్న సెల్ఫ్ గోల్ లు. మరి ఈ రాజకీయం ఫ్యూచర్‌లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

-రాకేష్, టీవీ9 తెలుగు.

Also read:

Minister Harish Rao: తెలంగాణ అంటే బీజేపీకి కడుపు నిండా విషమే.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు..

Valentine’s Day: ఫిబ్రవరి 14 పై విహెచ్‌పి, భజరంగ్‌ దళ్ నేతల కీలక ప్రకటన.. ఇంతకీ వారేమన్నారంటే..