Telangana: టీఆర్‌ఎస్‌లో మరో అలజడి.. ఈ సీనియర్ నేత చేసిన కామెంట్స్ వెనుక అర్థమేంటి?

|

Dec 06, 2022 | 9:29 AM

దారులు మూసుకుపోలేదు, అన్ని మార్గాలూ తెరిచే ఉన్నాయి. మనకుండేది మనకుంది, అందరూ మనల్నే అడుగుతున్నారు. కార్యకర్తల సమావేశంలో జూపల్లి కృష్ణా రావు వ్యాఖ్యలివి.

Telangana: టీఆర్‌ఎస్‌లో మరో అలజడి.. ఈ సీనియర్ నేత చేసిన కామెంట్స్ వెనుక అర్థమేంటి?
Trs Party
Follow us on

దారులు మూసుకుపోలేదు, అన్ని మార్గాలూ తెరిచే ఉన్నాయి. మనకుండేది మనకుంది, అందరూ మనల్నే అడుగుతున్నారు. కార్యకర్తల సమావేశంలో జూపల్లి కృష్ణా రావు వ్యాఖ్యలివి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎందుకీ వ్యాఖ్యలు? జూపల్లి మనస్సులో మరో ఆలోచన ఏదైన ఉందా? ఈ వ్యాఖ్యల సారాంశమేంటి? వాటి అర్థమేంటి? పరమార్థమేంటి? అన్నిదారులు ఓపెన్ చేసి ఉన్నాయంటే.. ఏ దారి ఎంచుకుంటారు?

ఇప్పటికైతే కారులో ప్రయాణిస్తున్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు. ఆయన ఆలోచనలో ఏదైన మార్పు ఉందా? పక్క పార్టీల వైపు ఏమైన చూస్తున్నారా? ఇందుకోసమే కార్యకర్తల సమావేశమా? అంటే కొల్లాపూర్ చౌరస్తాలో రకరకాల పొలిటికల్ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలను కడుపున పెట్టుకొని చూసుకుంటా, మీ అందరి నిర్ణయమే నా నిర్ణయం. మీరు ఏ దారి ఎంచుకోమంటే అదే దారి ఎంచుకుంటా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జూపల్లి.

జూపల్లి కృష్ణా రావు రాజకీయ భవిష్యత్‌పై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న క్రమంలో కార్యకర్తల ఆయన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఇంకా దారులు మూసుకుపోలేదు, అన్ని మార్గాలూ తెరిచే ఉన్నాయంటూ నర్మగర్భంగా మాట్లాడారు జూపల్లి. మనకుండేది మనకుంది, అందరూ మనల్నే అడుగుతున్నారంటూ కార్యకర్తలకు హింట్‌ ఇచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మళ్లీ వెనకడుగు వేయలేం, అందుకే తొందరపడటం లేదన్నారు జూపల్లి కృష్ణారావు.

ఎన్నికలకు ఏడాది మిగిలి ఉండగానే.. తెలంగాణలో పాలిటిక్స్‌లో హైఓల్టేజ్‌లో కంటిన్యూ అవుతున్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలవ్వగా.. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఉంది. గతంలో ఇద్దరి సవాళ్లు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ కొల్లాపూర్ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో జూపల్లి వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..