Patnam Mahender Reddy: మరీ ఇంత దారుణంగానా..? పచ్చి బూతులు.. సీఐపై ఎమ్మెల్సీ వీరంగం..

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బూతుపురాణం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ ఓ సర్కిట్ ఇన్‌స్పెక్టర్‌ను ఆయన అసభ్యకరమైన బూతులు తిడుతున్న ఆడియో దుమారం రేపుతోంది.

Patnam Mahender Reddy: మరీ ఇంత దారుణంగానా..? పచ్చి బూతులు.. సీఐపై ఎమ్మెల్సీ వీరంగం..
Patnam Mahender Reddy Audio

Updated on: Apr 27, 2022 | 8:44 PM

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కోపం వచ్చింది. ఫైలట్‌ రోహిత్ రెడ్డితో ఆయనకు ఉన్న పంచాయితీల నేపథ్యంలో ఆ కోపం కాస్తా ఓ సీఐ మీదకు మళ్లింది. కట్ చేస్తే.. ఫోన్ కాల్ అంతా… అ కారాలు, మకారాలు, లకారాలతో బండ బూతులు మాట్లాడారు. అటువైపు నుంచి సీఐ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. చివరికి నువ్వో, నేనో చూసుకుందాం అంటూ ఆ ఫోన్‌కాల్‌లో ముక్తాయింపు కనిపించింది. కానీ.. ఓ ప్రజాప్రతినిధి, స్థానిక సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ని బండబూతులు తిట్టడం సంచలనంగా మారింది. అస్సలు ఆ ఫోన్ కాల్… వినలేం, వినిపించలేం. బీప్‌ సౌండ్స్‌తో సెన్సార్‌ అప్లై చెయ్యక తప్పని పరిస్థితి. పోలీసులైతే ఆలయంలో కార్పెట్ వెయ్యరా అని ఎమ్మెల్సీ, మేం ఆ పని ఎందుకు చేస్తామంటూ సీఐ మధ్య మొదలైన కాల్.. చివరికి ఫైలట్‌ రోహిత్‌ రెడ్డి అనుచరుల వైపుకు మళ్లింది. ఆయన అనుచరులను అనుమతించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ తిట్లు అందుకున్నట్లు కనిపించింది. ఇదే విషయంపై నిన్న యాలాలా ఎస్సైపైనా మహేందర్ రెడ్డి చిందులు తొక్కినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం నాకేమీ తెలీదని ఆయన చెప్పడంతో మహేందర్‌రెడ్డి కాల్‌ సీఐకి వచ్చింది. అది కాస్తా సీఐ ఇసుక వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలకూ దారి తీసింది. ఒకవేళ ఇసుక వ్యాపారమే చేస్తే ఇంతకముందు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: Vizag: డాక్టర్ కాదు కీచకుడు.. ఒంట్లో బాలేదని బాలిక ఆస్పత్రికి వెళ్తే..