AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: డాక్టర్ కాదు కీచకుడు.. ఒంట్లో బాలేదని బాలిక ఆస్పత్రికి వెళ్తే..

విజయవాడ జీజీహెచ్ ఘటన మరువక ముందే విశాఖలో మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ డాక్టర్. ఒంట్లో బాలేదని బాలిక ఆస్పత్రికి వెళ్తే.. తప్పుగా ప్రవర్తించాడు.

Vizag: డాక్టర్ కాదు కీచకుడు.. ఒంట్లో బాలేదని బాలిక ఆస్పత్రికి వెళ్తే..
Doctor
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2022 | 6:49 PM

Share

విజయవాడ(Vijayawada) జీజీహెచ్ ఘటన మరువక ముందే విశాఖలో మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ డాక్టర్. జీజీహెచ్ లో ఆస్పత్రి సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడితే.. ఇక్కడ ఏకంగా డాక్టరే కామాంధుడి అవతారం ఎత్తాడు. ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు వచ్చిన 17 ఏళ్ల బాలికపై వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు ఓ డాక్టర్. చికిత్స చేసే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించాడు డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి. ఈ ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలో జరిగింది. డాక్టర్ అసభ్య ప్రవర్తనపై తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు కంప్లైంట్ చేసింది మైనర్. ఈ ఘటనను విశాఖ టీడీపీ(Tdp) మహిళా నేత అనంతలక్ష్మి తీవ్రంగా ఖండించారు. మహిళా కమీషన్ ఛైర్ పర్మన్ వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma).. ఈ విషయంలో ఎవరికి నోటీసులు ఇస్తుందో చెప్పాలంటూ ప్రశ్నించారు.

విజయవాడ అత్యాచార ఘటనపై సీఎం సీరియస్…

విజయవాడ అత్యాచార ఘటనపై రెస్పాండ్‌ అయ్యారు సీఎం జగన్‌. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్‌ కాకూడదని హెచ్చరించారు. అధికారులు అలసత్వం వీడకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు సీఎం. పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు సీఎం జగన్‌. విధుల్లో అలసత్వం వహించారనే ఆరోపణలపై సీఐ, ఎస్‌ఐలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం అంటే ఓ నమ్మకమని.. నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచి చేయాలని సూచించారు. విద్యావైద్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం.

Also Read: Thati Munjalu: ఏంటి ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు