TRS Party MLA: ఆ అర్హతలన్నీ ఆయనకు పుష్కలంగా ఉన్నాయి.. మంత్రిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్..

TRS Party MLA: తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై నకిరేకల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు..

TRS Party MLA: ఆ అర్హతలన్నీ ఆయనకు పుష్కలంగా ఉన్నాయి.. మంత్రిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్..

Updated on: Jan 03, 2021 | 7:11 PM

TRS Party MLA: తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై నకిరేకల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మంత్రి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి మీడియాతో మాట్లాడారు. పరిపాలన దక్షత, ప్రజల్లో క్రేజ్, విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ అని పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశంపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అలాంటి నేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచే జరుగుతుందని చిరుమర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేది ఎప్పటికైనా కల్వకుంట్ల కుటుంబమే అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కేసీఆర్ గారి ఆశీస్సులతో మంత్రి కేటీఆర్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టవచ్చునని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ యువరాజు, మంత్రి కేటీఆర్ త్వరలోనే బాధ్యతలు చేపడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రి కేటీఆర్ క్లారిటీ కూడా ఇచ్చారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే అని కేటీఆర్ ఎన్నోసార్లు మీడియా ముఖంగా ప్రకటించారు. అయినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఈ ప్రచారం బాగా పెరుగుతోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళతారని, ముఖ్యమంత్రి బాధ్యతలను ఆయన తనయుడు కేటీఆర్‌కు అప్పగిస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.

 

Also read:

Tadipatri Clashes: రగులుతున్న తాడిపత్రి.. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష నిర్ణయం.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి..

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్‌తో జతకట్టేందుకు అతిలోక సుందరి కూతురు ఓకే చెప్పిందా..?