Trs vs Congress: టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా విమర్శలు గుప్పిస్తుండటంతో.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం అంతే దూకుడుగా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మాటలు తగ్గించుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గువ్వల.. తమ నేత కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి పదే పదే నిరాధార విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ విసిరిన సవాల్‌కు రాహుల్ గాంధీ స్పందిస్తారా? అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏ టెస్ట్‌కైనా కేటీఆర్ సిద్ధం.. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఒప్పిస్తారా? అని సవాల్ విసిరారు.
అమరుల స్థూపం వద్దకు వెళ్లే అర్హత రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదన్నారు. రేవంత్ రెడ్డి తన భజనపరులకు డబ్బు ఇచ్చి టీఆర్ఎస్‌పై విమర్శలు చేయిస్తున్నారని గువ్వల ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కేవలం గుర్తింపు కోసం మాత్రమే విమర్శలు చేస్తున్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసేది యుద్ధంకాదని, ప్రజలను సాకుగా చూపుతూ దందా చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని యావత్ ప్రపంచమే అభినందిస్తోందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారన్న ఆయన.. తీరు మారకపోతే తమ ప్రాక్టీస్ కూడా మారుతుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు.. ఆయన పార్టీ నేత రాహుల్ గాంధీకి చుట్టుకుంటుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ప్రెసిడెంట్‌గా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని గువ్వల పేర్కొన్నారు.
Also read:
Pelli SandaD: సూపర్ స్టార్ చేతుల మీదగా దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే..
Health Tips: నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? రాత్రిపూట ఈ పదార్థాలను అస్సలు తీసుకోవద్దు..