Bjp vs Trs: తెలంగాణలో కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన చిచ్చు.. స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్న టీఆర్ఎస్ నేతలు..

|

Sep 04, 2022 | 9:58 PM

Bjp vs Trs: తెలంగాణ పర్యటనలో దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చేసిన వ్యాఖ్యల సెగ.. ఇంకా చల్లారడం లేదు. కేంద్రమంత్రికి గులాబీదళం కౌంటర్లు ఇస్తూనే ఉంది.

Bjp vs Trs: తెలంగాణలో కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన చిచ్చు.. స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్న టీఆర్ఎస్ నేతలు..
Trs Vs Bjp
Follow us on

Bjp vs Trs: తెలంగాణ పర్యటనలో దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చేసిన వ్యాఖ్యల సెగ.. ఇంకా చల్లారడం లేదు. కేంద్రమంత్రికి గులాబీదళం కౌంటర్లు ఇస్తూనే ఉంది. దీంతో రచ్చ నాన్‌స్టాప్‌గా కంటిన్యూ అవుతోంది. ఇవాళ మరోసారి నిర్మలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు టీఆర్‌ఎస్‌ నేతలు.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య వార్‌ పీక్స్‌కు చేరిందనుకుంటే.. కేంద్రమంత్రి నిర్మల తెలంగాణ పర్యటన తర్వాత అది నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్లింది. ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు. తెలంగాణకు కేంద్రం భారీగా సాయం చేసిందన్న నిర్మల వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. అది శుద్ధ అబద్ధమంటూ లెక్కలతో సహా వివరిస్తున్న గులాబీదళం.. బీజేపీ నేతలకు కౌంటర్లు ఇస్తోంది.

తాజాగా, మరోసారి కేంద్రమంత్రిపై సోషల్‌ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్‌. కేంద్రం, తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు ఇవే అంటూ.. ట్విట్టర్‌లో వివరాల్ని షేర్‌ చేశారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. తెలంగాణ ఇస్తున్న ప్రతీ రూపాయిలో 46పైసలు మాత్రమే వెనక్కి వస్తోందని చెప్పారు. బిజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ తెలంగాణ నిధుల్నే ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం నిర్మలా సీతారామన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అబద్ధపు ఆరోపణలతో.. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను వ్యక్తం చేశారని విమర్శించారు. దేశ ఆర్థిక మంత్రి పదవికి ఏమాత్రం తగని సీతారామన్‌.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు,రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల దుమారం.. ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ మరింత వేడి రాజుకుంది. ఇది మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..