Telangana Politics: ‘సీఎం సార్.. మా గురించి కూడా అలోచించండి’.. ఆ ఇద్దరు నేతల ఎదురుచూపులు..

Telangana Politics: హుజురాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో కావాల్సినంత పోలిటిక‌ల్ డ్రామ‌ను చూశాం. మాట‌లతో మంట‌లు పుట్టించారు నేత‌లు. అదే స‌మ‌యంలో జ‌ంపింగ్‌లు కూడా..

Telangana Politics: ‘సీఎం సార్.. మా గురించి కూడా అలోచించండి’.. ఆ ఇద్దరు నేతల ఎదురుచూపులు..
Kcr Trs

Edited By:

Updated on: Feb 07, 2022 | 10:21 AM

Telangana Politics: హుజురాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో కావాల్సినంత పోలిటిక‌ల్ డ్రామ‌ను చూశాం. మాట‌లతో మంట‌లు పుట్టించారు నేత‌లు. అదే స‌మ‌యంలో జ‌ంపింగ్‌లు కూడా తీవ్రంగా జ‌రిగాయి. బీజేపీ, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు వ‌రుస క‌ట్టి వేళ్లారు. అయితే కాంగ్రెస్ నుండి వెళ్లిన పాడి కౌషిక్ రెడ్డికి, టీడీపీ నుండి వెళ్లిన ఎల్.ర‌మ‌ణ‌కు ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాని బీజేపీ నుండి వెళ్లిన నేత‌లు మాత్రం ఇంకా త‌మకంటు ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌ని అశ‌గా ఏదురుచుస్తున్నారు.

స‌రిగ్గా హుజురాబాద్ ఎన్నిక‌ల ముందే టీఆర్ఎస్ లోకి వెళ్లిన బీజేపీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు ఇద్దరూ ఇప్పుడు కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చుస్తున్నారు. కౌశిక్, ఎల్.ర‌మ‌ణ కు మాట ఇచ్చిన విధంగా త‌మ‌కు కూడా ఒక ప‌ద‌వి ఇస్తే బాగుంటుద‌ని అనుకుంటున్నారు. ఇదే విషయంపై ఒకసారి సీఎం కేసీఆర్ కు క‌నిపించి గుర్తిచేయాల‌ని అనుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. మోత్కుప‌ల్లికి ద‌ళిత బంధు ఛైర్మన్ ప‌ద‌వి వ‌స్తుంద‌నే ప్రచారం జ‌రిగినప్పటికి కేసీఆర్ దాని గురించి ఇప్పటి వ‌ర‌కు అలోచించ‌లేదు. మ‌రోవైపు పెద్ది రెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థాయి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అశ‌గా ఉన్నారు. మరి ఈ ఇద్దరి నేత‌ల‌పై సీఎం కేసిఆర్ ఎప్పుడు కరునిస్తారో చూడాలి.

Also read:

Hotel Room: హోటల్ గదిని తక్కువ రేటులో బుక్ చేసుకోవడం ఎలా?

Lata Mangeshkar: అత్యంత మధురమైన గాత్రం లోకాన్ని వీడడం చాలా బాధాకరం: ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్

Hair Care Tips: కరోనాతో జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. ఒత్తైన జుట్టుకోసం అమ్మకాలం నాటి ఈ చిట్కాలు పాటించి చూడండి..