Kadiyam: ‘దళిత బంధు’ అమలు చేయకపోతే నష్టపోయేది మా పార్టీనే.. కడియం సంచలన వ్యాఖ్యలు

|

Aug 14, 2021 | 9:40 PM

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జనగామ జిల్లాలో ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలపై ఉవ్వెత్తున లేచిన ఆయన.. దళిత బంధు

Kadiyam: దళిత బంధు అమలు చేయకపోతే నష్టపోయేది మా పార్టీనే.. కడియం సంచలన వ్యాఖ్యలు
Kadiyam Srihari
Follow us on

Kadiyam Srihari: మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జనగామ జిల్లాలో ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలపై ఉవ్వెత్తున లేచిన ఆయన.. దళిత బంధు అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది మా పార్టీనే అని మాకు తెలుసు అంటూ విపక్షాలకు చురకలంటించారు. దళితుల వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మాకు తెలుసు.. అంటూ శ్రీహరి వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎన్నికల్లో ఘోరమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది అని ఆయన అన్నారు.

“ఇవన్నీ తెలిసే భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే దళిత బంధు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద వర్గాలైన దళితుల జీవన ప్రమాణాలు మెరుపర్చేందుకే దళిత బంధు. ఏడేళ్లుగా ఎమీ చేయకుండా హుజురాబాద్ ఉప ఎన్నికల దష్పచారాం చేయడం నిరాదరమైన ఆరోపణ. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయరనే విమర్శలు సరికాదు. మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు మేము సింహం మీద కూర్చిని సవారీ చేస్తున్నామని.. గతంలో నీటిపారుదల రంగానికి ఎలా పెద్దపీట వేశారో ఇప్పుడు దళితుల అభ్యున్నతికి కూడా అలాగే పెద్దపీట.” అని శ్రీహరి సంచలన కామెంట్లు చేశారు.

Read also: Wedding: పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తె మండపంలో లేరు.. అయినా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిపోయింది