Jagadish Reddy: అలా చేస్తే ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటాం.. ప్రధాని మోడీ, అమిత్ షాలకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్..

|

Oct 10, 2022 | 4:47 PM

ప్రధాని మోదీ, అమిత్ షాలకు మంత్రి జగదీశ్ రెడ్డి ఈ సందర్భంగా సవాల్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కట్టబెట్టిన 18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి.. ఉప ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటామని స్పష్టంచేశారు.

Jagadish Reddy: అలా చేస్తే ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటాం.. ప్రధాని మోడీ, అమిత్ షాలకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్..
Jagadish Reddy
Follow us on

మునుగోడులో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సైతం దూకుడు పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి.. ఈ మధ్యాహ్నం నామినేషన్ వేశారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి, వామపక్ష నేతలతో కలిసి.. సరిగ్గా రెండు గంటలకు నామపత్రాలు దాఖలు చేశారు. ఈసందర్భంగా ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చాయి. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి వల్ల ఆగిపోయిన అభివృద్ధి.. టీఆర్‌ఎస్‌తో ముందుకు వెళ్తుందన్నారు గులాబీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధికి పట్టంకట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. మోసకారి రాజగోపాల్‌ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరని.. కాంట్రాక్టుల కోసం ఆయనఅమ్ముడుపోయారని అందరికీ తెలుసంటూ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ విమర్శించారు.

ప్రధాని మోదీ, అమిత్ షాలకు మంత్రి జగదీశ్ రెడ్డి ఈ సందర్భంగా సవాల్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కట్టబెట్టిన 18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి.. ఉప ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటామని స్పష్టంచేశారు. అలా చేస్తే సీఎం కేసీఆర్ ను ప్రాధేయపడైన ఒప్పిస్తామని పేర్కొన్నారు. ఒక వ్యక్తి కోసం 18000 కోట్ల రూపాయిలు ఇవ్వడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి.. అప్పుడు అందరూ బాగుపడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలతోపాటు.. కమ్యూనిస్టు నేతలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, మునుగోడు మండలం కొరటికల్‌లో ఉపఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ అధికారికంగా ప్రారంభించింది. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి బతుకమ్మలు, బోనాలతో స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..