Munugode Bypoll: పొలిటికల్ హీట్ రాజేస్తున్న మునుగోడు బైపోల్.. ప్రచార ఢంకా మోగించిన ప్రధాన పార్టీలు.. అన్ని దారులు..

మునుగోడు బైపోల్‌కు.. ప్రధాన పార్టీలు ప్రచార ఢంకా మోగించాయి. మునుగోడులో సత్తా చాటేందుకు పట్టుబిగిస్తున్నాయి. మంత్రులు, ముఖ్య నేతల ప్రచార తేదీలను అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించాయి. కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. మునుగోలులో పొటిలికట్ హీట్ రాజేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.

Munugode Bypoll: పొలిటికల్ హీట్ రాజేస్తున్న మునుగోడు బైపోల్.. ప్రచార ఢంకా మోగించిన ప్రధాన పార్టీలు.. అన్ని దారులు..
Munugode
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 11, 2022 | 7:51 PM

మునుగోడు ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీని పటిష్ట పరిచేందుకు.. నియోజకవర్గాన్ని చుట్టేసేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. నియోజకవర్గంలో పార్టీ చేరికలను విసృతం చేస్తున్నారు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి. ఇవాళ నాంపల్లి మండలం మల్లపురాజు పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ భవనం, పాఠశాల అదనపు గదులు, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు మంత్రి జగదీశ్ రెడ్డి. దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీకి మునుగోడు ప్రజలు ఉప ఎన్నికతో సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బిజెపికి మూడో స్థానమేనని చెప్పారు. బీజేపీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హినుడిగా మిగిలిపోతాడని విమర్శించారు మంత్రి జగదీశ్.

మునుగోడులో మరోసారి తనసత్తా చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇవాళ నియోజకవర్గ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఇంచార్జి సునీల్ బన్సల్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక.. భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం అని చెప్పారు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక .. తెలంగాణ మలీ ఉద్యమం అని అన్నారు. ఈ ఉప ఎన్నికతో ప్రజలు కను విప్పు కలిగే తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.

మునుగోడు ఉప ఎన్నికకు పార్టీని స్పీడ్ అప్ చేశారు కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గంలో తన గెలుపునకు కృషి చేయాలంటూ.. ప్రచారానికి పార్టీ పెద్దలను ఆహ్వానిస్తున్నారు ముగుగోడు ఇంచార్జి పల్వాయి స్రవంతి. ఈమేరకు ఇవాల భట్టి విక్రమార్క, విహెచ్‌తో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డిని సైతం కలిసారు పాల్వాయి స్రవంతి. మునుగోడు ప్రచారానికి వస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, అభ్యర్థి స్రవంతితో నిన్న రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంట్లో భేటీ అయ్యారు. ఉపఎన్నికలో కలిసి పనిచేయాలని కోరారు. ఈనెల 18 నుంచి కీలక నేతల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు.

ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు చలో మునుగోడుకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఈనెల 15 నుంచి మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు బాట పట్టనున్నారు. పార్టీ గెలుపునకు కృషి చేసేందుకు మండలాలు, గ్రామాలవారీగా నేతల జాబితాను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈనెల 18 నుంచి కాంగ్రెస్ సైతం మునుగోడు ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇక బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి నిత్యం ప్రజలతో ఉంటున్నారు. పార్టీ ప్రధాననేతలను పిలిచి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం