గవర్నర్ తమిళిసై కామెంట్స్‌పై(Governor’s Tamilisai) కీలక వ్యాఖ్యలు చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavathi Rathod). ఏమైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా చెప్పుకోవడానికి అనేక వేదికలు ఉన్నాయని.. అలా కాకుండా ఢిల్లీలో మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు సత్యవతి. సీఎం కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం. గవర్నర్.. బీజేపీ నేతలను కలిసి మాపై విమర్శలు చేయడం, తాను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందనడం సరికాదు. వందమందికి పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ఎలా కూలుస్తారు? ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. కలిసే వారిని కలువకుండా బీజేపీ వారిని కలిసి మాపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. నేను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అనడం కరెక్ట్ కాదన్నారు. అసెంబ్లీ ప్రొరోగ్ కానందునే బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం. గవర్నర్ ఢిల్లీకి వెళ్లి మాట్లాడిన మాటలను చూస్తుంటే గవర్నర్ మనస్సులో ఏముందో అర్థం అవుతుందన్నారు. మీ ఆంతర్యం ఏంటో తెలంగాణ ప్రజలకు అంత అర్థం అవుతోందన్నారు.
ఏమైనా జరిగి ఉంటే ఇక్కడే చెప్పాల్సింది.. కానీ ప్రధాని ,హోమ్ మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంను బెదిరించినట్టు మాట్లాడటం సరికాదన్నారు. కానీ ఆమె గవర్నర్ గా మాట్లాడినట్టు భావించడం లేదన్నారు. ఆమె మాట్లాడిన మాటలు ఆలోచన చేసుకోవాలన్నారు. ఆమెకు తెలంగాణలో అవమానం జరిగితే ఇక్కడే మాట్లాడల్సింది.. కానీ ఢిల్లీలో ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్తే రాష్ట్రపతి కలువకుండా ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదులు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై బీజేపీ కార్యకర్తలా మాట్లాడారు.
ముగ్గురితో ప్రభుత్వాన్ని కూలుస్తారా? ప్రభుత్వాలను కూలిస్తే గతంలో ఏం జరిగింది? ప్రభుత్వం కులుతుందని అంటుంది..? ఆమె ఏమనుకుంటుంది..? విమర్శలు చేయడం సరికాదు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి.. అప్పుడు ఏ గతి పట్టిందో ఇప్పుడు కూడా అదే గతి పడుతుందన్నారు. 119 స్థానాలకు 100పై చిలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఉన్నారు.. ఎలా కులుస్తారు.
ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..
APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్..