దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంప్రదాయంగా కామదేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ .ఆదివాసీల జాతిలో తొడసం వంశీయులు ఆరాధ్య దైవం కాం దేవుడు కొలువై ఉన్న నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఖాందేవుని జాతర ప్రారంభమైంది .ఖాందేవుని మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 15 రోజుల పాటు ఖాందేవుని సన్నిధిలో జాతర జరగడం ఆనవాయితీ .దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజు సంప్రదాయ సంప్రదాయంగా ఖాందేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ .
తొడసం వంశస్తుల ఆరాధ్య దైవమైన ఖాందేవునికి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెలరోజుల ముందే ఆదివాసీలు ఇంట్లో నువ్వులనూనె తయారుచేస్తారు. అలాతయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకువస్తారు. అలా ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా మహారాష్ట్ర, చేతిశ్ఘర్డ్ నుంచి తరలివస్తారు తొడసం వంశస్తులు. ఈరోజు మంగళవారం ఉదయం నుంచి ఖాందేవునికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు.
మహరాష్రం కోద్దిపూర్ గ్రామనికి చెందిన తొడసం వంశస్తుల ఆడపడుచు మెస్రం నాగుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. వందేళ్లుగా ఈ ఆచారం వస్తుందని, తొడసం ఆడపడుచులు మూడేళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు. ఈ సందర్భంగా మహాపూజకు అసిఫాబాద్ జడ్పి చేర్పర్సన్ కోవ లక్ష్మీ , మహరాష్ర ఎమ్మెల్యే తోడసం రాజు ,లకు తొడసం వంశీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖాందేవు నికి ప్రత్యేక పూజలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..