TS Gurukulam Teacher Exam Dates: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలను నియామక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని నియామక బోర్డు (TREIRB) కార్యనిర్వాహక అధికారి మల్లయ్య బట్టు గురువారం (జూన్ 15) తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రకటన జూన్ 17న ప్రకటించనున్నట్లు తెలిపారు. జేఎల్, డీఎల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.
కాగా రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పరిధిలో 9 నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 9,210 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్ 5న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి ఏప్రిల్ 14 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 2,63,045 వరకు దరఖాస్తులు అందాయి. వీటిల్లో 1.6 లక్షల దరఖాస్తులు టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి రావడం విశేషం. ఇక నియామక పరీక్షలను తొలుత ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని బోర్డు భావించినప్పటికీ లీకుల నేపథ్యంలో సీబీఆర్‌టీ విధానమే బెస్ట్ అని నిర్ణయించింది. వేగంగా పరీక్షలు నిర్వహించి, ఆ త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.