TS Gurukula Revised Exam Dates: నిరుద్యోగులకు గమనిక.. ‘గురుకుల’ ఉపాధ్యాయ పరీక్షల తేదీలు మారాయ్! కొత్త తేదీలివే

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,120 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు..

TS Gurukula Revised Exam Dates: నిరుద్యోగులకు గమనిక.. ‘గురుకుల’ ఉపాధ్యాయ పరీక్షల తేదీలు మారాయ్! కొత్త తేదీలివే
TS Gurukula Exam Dates

Updated on: Jul 20, 2023 | 1:32 PM

హైదరాబాద్‌, జులై 20: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,120 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేసినట్లు ప్రకటించింది. తొలుత ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నియామక బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే తాజా ప్రకటనతో ఆగస్టు 23 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు జులై 24 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ వివరాలతో వెబ్‌సైట్లో లాగిన్‌ అయ్యి సంబంధిత సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లను ఒకేసారి డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు బోర్డు తెల్పింది. పరీక్షల సవరణ షెడ్యూల్ కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సూచించింది. సవరించిన పరీక్ష తేదీల దృష్ట్యా అభ్యర్ధులు తమ పరీక్ష తేదీలను మరోసారి సరి చూసుకోవాలని తెల్పింది. ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు ఉదయం 8.30 నుంచి 10.30 వరకు ఉంటుంది. రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు ఉంటుంది. మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతుందని గురుకుల నియామక బోర్డు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.