Telangana: అయ్యో దేవుడా.. కారు కింద పడి 13 నెలల చిన్నారి మృతి.. రివర్స్ చేస్తుండగా..

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తప్పిందం ఓ కుటంబంలో తీవ్రశోకాన్ని మిగిల్చింది. చిన్న తప్పిదానికి రెప్పపాటు కాలంలో అభం.. శుభం తెలియని 13 నెలల చిన్నారి కారు కిందపడి బలైపోయాడు.

Telangana: అయ్యో దేవుడా.. కారు కింద పడి 13 నెలల చిన్నారి మృతి.. రివర్స్ చేస్తుండగా..
Crime News

Updated on: Apr 10, 2023 | 8:17 AM

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తప్పిందం ఓ కుటంబంలో తీవ్రశోకాన్ని మిగిల్చింది. చిన్న తప్పిదానికి రెప్పపాటు కాలంలో అభం.. శుభం తెలియని 13 నెలల చిన్నారి కారు కిందపడి బలైపోయాడు. పార్కు చేసిన కారు రివర్స్ చేస్తుండగా.. సెడన్ గా బాలుడు కారు వెనుకకు రావడంతో టైర్ కిందపడి చనిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దారుణ ఘటన కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో జరిగింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

చిన్నారి అయన్షు పెద్దనాన్న.. కిరాయి కోసం కారును బయటకు తీస్తుండగా అకస్మాత్తుగా ఈ ఘటన జరిగిందంటూ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో చిన్నారి తండ్రి సిద్దం స్వామి తెలిపారు. అయితే ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ పేరుతో ఇదే కారు నెంబర్ పై తెలంగాణ ఈ-చలానా వెబ్ సైట్ లో నాలుగు చలానాలు నమోదయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దేవునిపల్లి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..