Hyderabad: నగరవాసులకు అలర్ట్.. జగ్ నే కీ రాత్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లోనే రెస్ట్రిక్షన్స్..

|

Feb 18, 2023 | 8:47 AM

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని శైవాలయాలు, చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు..

Hyderabad: నగరవాసులకు అలర్ట్.. జగ్ నే కీ రాత్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లోనే రెస్ట్రిక్షన్స్..
Traffic Diversions
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని శైవాలయాలు, చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహా శివరాత్రి, షబ్‌- ఈ -మేరజ్‌ (జగ్‌నే కి రాత్‌) సందర్భంగా శనివారం రాత్రి 10 గంటల తర్వాత (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్‌ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, లంగర్‌హౌస్‌ ఫ్లై ఓవర్లకు మినహాయింపు ఉంటుందన్నారు. ఆయా రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. మార్పును గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.

కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున నుంచి భక్తుల ప్రత్యేక అభిషేకాలు పూజలతో పండగ వాతావరణం ఏర్పడింది. అమరావతి అమరేశ్వరాలయం లో తెల్లవారుజామున నుండే భక్తులు రద్దీ నెలకొంది. కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు. సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. రాత్రి ఒంటిగంటకు స్వామివారికి తొలి అభిషేకం చేశారు అర్చకులు. మహానంది క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు.

వేములవాడ, కీసర గుట్ట, రామప్ప గుడి, రాజేంద్రనగర్ సర్కిల్ రాంబాగ్ చిన్న అనంతగిరి దేవాలయంలో హైదర్ గూడ ప్రణవభక్త సమాజం ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీసులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..