Revanth Reddy: కేసీఆర్ పాలనలో రోడ్డు మీద కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి.. రేవంత్ స్ట్రాంగ్ కామెంట్స్..

|

Feb 22, 2023 | 12:21 PM

తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కుక్క కరిచి బాలుడు చనిపోతే.. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు..

Revanth Reddy: కేసీఆర్ పాలనలో రోడ్డు మీద కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి.. రేవంత్ స్ట్రాంగ్ కామెంట్స్..
Revanth Reddy
Follow us on

తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కుక్క కరిచి బాలుడు చనిపోతే.. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఐదేళ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపేస్తే ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని ఆక్షేపించారు. కుక్కలకు ఆకలేసిందని హైదరాబాద్ మేయర్ మాట్లాడుతున్నారని, ఇది ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. వీధి కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని మండిపడ్డారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఆ మాటలు విస్మరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

విశ్వనగరంలో పాలన కుక్కలు బాలుడిపై దాడి చేసి చంపేవరకు వచ్చింది. జరిగింది ఒకటైతే.. ప్రజాప్రతినిధులు చెబుతున్నది మరొకటి. చిన్నారిని కుక్కలు చంపిన ఘటనపై సారీ చెప్పడం సిగ్గుచేటు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారు. అంబర్‌పేటలో వీధి కుక్కలకు బలై నాలుగేళ్ల బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యహరిస్తోంది. రోడ్డు మీద కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. ప్రదీప్ కుటుంబానికి నష్ట పరిహారం ప్రకటించాలి.

    – రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

మరోవైపు.. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని వీధి కుక్కల బెడదకు నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై వెంటనే ఎంక్వయిరీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడు ప్రదీప్‌ కుటుంబానికి సంతాపం తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..