Revanth Reddy: సీఎం కేసీఆర్‌ క్లౌడ్‌ బరెస్ట్‌ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌

Telangana Politics: లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో సీఎల్పీ సమావేశం వాడివేడిగా సాగింది. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన నేతలు.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అయితే, ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దూరంగా ఉండడం గమనార్హం.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ క్లౌడ్‌ బరెస్ట్‌ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌

Updated on: Jul 17, 2022 | 8:30 PM

Telangana Politics: లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో సీఎల్పీ సమావేశం వాడివేడిగా సాగింది. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన నేతలు.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అయితే, ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దూరంగా ఉండడం గమనార్హం. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నేతలు సైతం.. ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) , ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా ముఖ్యనేతలు పాల్గొన్న కంబైన్డ్‌ మీటింగ్‌లో.. ప్రధానంగా వరదలు, రాహుల్ సభ, భారత్ జోడోయాత్రలపై చర్చించారు. సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ.. ఈనెల 21న భారీ ఆందోళనలు చేపట్టాలని కూడా నిర్ణయించారు. పార్టీ అంతర్గత అంశాలపైనా ఈ మీటింగ్‌లో కీలకంగా చర్చించారు.

కాగా వరద నష్టం ఆందోళనకరంగా ఉందనీ.. ముందస్తు సమాచారం ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. పంట నష్టం అంచనా వేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని.. తక్షణమే ఆ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా రాష్ట్రంలో విదేశాలు క్లౌడ్ బరెస్ట్ చేశాయన్న సీఎం కేసీఆర్‌ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టాలన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. అయినా, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. రాహుల్ గాంధీ పర్యటనపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో మొదటి గంటలోనే తెలంగాణ వరదలపై వాయిదా తీర్మానం కోరుతామని చెప్పారు.

పార్టీలో అవమానాలు: వీహెచ్‌

ఇవి కూడా చదవండి

ఇక, సమావేశానికి హాజరైన వీహెచ్‌… పార్టీలో తనను అవమనిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ గాంధీల కోసం అన్ని భరిస్తున్నాననీ చెప్పారు. పీసీసీ, సీఎల్పీ..  అందర్నీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చేరికలపై కమిటీ చైర్మన్ జానారెడ్డికి సైతం సమాచారం లేకుండా పోయిందని, ఈ పద్ధతి మార్చుకోవాలని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సరిగ్గా పార్టీ సమావేశం జరుగుతుండగానే తన ఇంటి దగ్గర.. పార్టీ టికెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. జడ్చర్ల టిక్కెట్‌ అనిరుధ్‌కేననీ.. కొత్తగా వచ్చిన వారు వేరే ప్లేస్ చూసుకోవాలనీ.. కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఒకవైపు ప్రజా సమస్యలు, మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాలపై హాట్‌హాట్‌ చర్చ జరిగినప్పటికీ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై టీకాంగ్రెస్‌ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..