AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతాంగానికి రేవంతర్ రెడ్డి బహిరంగ లేఖ.. కీలక విషయాల ప్రస్తావన.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా రేవంత్‌.. రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపునిచ్చారు. రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలు దేరిందన్న రేవంత్‌.. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించిందని...

Telangana: రైతాంగానికి రేవంతర్ రెడ్డి బహిరంగ లేఖ.. కీలక విషయాల ప్రస్తావన.
TPCC President Revanth Reddy
Narender Vaitla
|

Updated on: Jul 16, 2023 | 3:28 PM

Share

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా రేవంత్‌.. రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపునిచ్చారు. రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలు దేరిందన్న రేవంత్‌.. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించిందని విమర్శించారు. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశామన్న రేవంత్‌.. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయిందన్నారు. ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టమైందని దుయ్యబట్టారు.

రేవంత్‌ లేఖలో ప్రస్తావించిన మరిన్ని అంశాల విషయానికొస్తే.. ‘రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలుగా ఉంది. రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రైతన్నలు కేసీఆర్‌ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో డబ్బులు జమ చేస్తామన్నారు ఏమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి ప్రభుత్వం లాక్కుంద’ని విమర్శించారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలిందని, కానీ.. కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుందన్నారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందన్న రేవంత్‌ రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే దీనికి సాక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్న రేవంత్‌.. అందుకే అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బక్ లను వెనక్కు తెప్పించుకుందన్నారు.

ఇవి కూడా చదవండి

ధాన్యం కొనుగోళ్లపై దొంగాట..

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయన్న రేవంత్‌.. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు అని యద్దేవ చేశారు. రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారని, ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక సదవకాశమన్నారు. ‘ఈ సమావేశాల్లో మన సమస్యలపై నిలదేసేందుకు సిద్ధం కండి. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రశ్నించండి. ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ప్రశ్నించండి. పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి. ఇందుకు యావత్ తెలంగాణ రైతు లోకం సిద్ధం కావాలని పిలుపునిస్తున్నా. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రేవంత్ చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?