తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ స్టార్ కంటెంస్టెంట్ దేత్తడి హరిక నియామకంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. మహిళా దినోత్సవం రోజున టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. అయితే ఈ ఉత్తర్వులు సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను సంప్రదించకుండానే ఆయన ఇచ్చినట్లు ఆ తర్వాతి రోజు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో హారిక నియామక వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. అయితే అంతా సవ్యంగానే జరిగిందని.. హారిక నియామకంలో ఎటువంటి వివాదం లేదని మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు శ్రీనివాస్ గుప్తా. అయితే తాజాగా ఈ ఇష్యూపై టూరిజం శాఖ మంత్రి స్పందించారు. హారిక అపాయింట్‌మెంట్ విషయం సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని సంచలన కామెంట్స్ చేశారు. తాము బ్రాండ్ అంబాసిడర్ ను పెద్ద స్థాయిలో నియమిస్తామని చెప్పారు.
ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్నానని, త్వరలోనే ఈ పరిస్థితిపై కంప్లీట్ విచారణ జరుపుతామని చెప్పారు. దీని వెనుక ఎవరున్నా చర్యలు కఠినంగానే ఉంటాయని వెల్లడించారు. అంతేకాకుండా త్వరలోనే మరో సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామంటూ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో హారిక నియామకంపై అటు ప్రభుత్వ వర్గాలతో పాటు, సదరు మంత్రిత్వ శాఖకు కూడా పెద్ద ఆసక్తి కనబర్చనట్టే అర్థమవుతుంది. లెట్స్ సీ.. మున్ముందు ఇంకెన్ని ట్విస్టులు చోటుచేసుకుంటాయో..!
Also Read:
ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ సడెన్‌గా మెరిసిన లగడపాటి రాజగోపాల్.. ప్రజల నాడి ఎలా ఉందని అడిగితే..?
లావుగా ఉన్నావని.. సన్నబడాలని భర్త వేధింపులు.. వివాహిత ఆత్మహత్య