Tomato Price: టమోటా దొంగలొస్తున్నారు జాగ్రత్త.. పెరిగిన ధరల ఎఫెక్ట్.. పలు రాష్ట్రాల్లో టమోటా పంటల లూటీ..

|

Jul 07, 2023 | 5:00 AM

పడుకునే ముందు తలుపులు సరిగా వేసుకున్నారో లేదో చూసుకోండి. కూరగాయలు అమ్మేవాళ్లు భద్రం బీకేర్‌ఫుల్‌. టమోటా పండిస్తున్నారా? అయితే కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే టమోటా దొంగలొస్తున్నారు జాగ్రత్త. టమోటా రేట్లకు రెక్కలు వచ్చాయి. అవి బంగారం రేటును మించి భగ్గుమంటున్నాయి.

Tomato Price: టమోటా దొంగలొస్తున్నారు జాగ్రత్త.. పెరిగిన ధరల ఎఫెక్ట్.. పలు రాష్ట్రాల్లో టమోటా పంటల లూటీ..
Tomato
Follow us on

పడుకునే ముందు తలుపులు సరిగా వేసుకున్నారో లేదో చూసుకోండి. కూరగాయలు అమ్మేవాళ్లు భద్రం బీకేర్‌ఫుల్‌. టమోటా పండిస్తున్నారా? అయితే కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే టమోటా దొంగలొస్తున్నారు జాగ్రత్త. టమోటా రేట్లకు రెక్కలు వచ్చాయి. అవి బంగారం రేటును మించి భగ్గుమంటున్నాయి. దీంతో దొంగల కన్ను టమోటా మీద పడింది. కన్నం దొంగలు, సున్నం దొంగలే కాదు గజదొంగలు కూడా దొరికిన కాడికి టమోటాలు దోచుకుపోతున్నారు. ఇంతకీ మీ ఇంట్లో టమోటాలు ఉన్నాయా?

టయోటా కారును ఎత్తుకువెళ్లే వాళ్లను చూశాం. టమోటాలను ఎత్తుకువెళ్లే వాళ్లను చూశారా? ఇప్పుడు చూస్తున్నాం. కూరగాయల షాపుల్లో టమోటాలు చోరి. టమోటా పంట లూటీ. టమోటా కనిపిస్తే బతకనిచ్చేలా లేరు దొంగలు. టమోటాలు ఉన్నవాళ్లు జర జాగ్రత్త. మీ ఇంట్లో టమోటాలు ఉంటే ఫ్రిజ్‌లో కాదు బీరువాలో పెట్టి తాళం వేయండి. ఇక టమోటా దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగే పరిస్థితి వచ్చేలా ఉంది.

పెరుగుతున్న ధరలతో ఎర్రపండుకి యమ డిమాండ్‌ ఏర్పడింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు దొంగలు. కుదిరితే కూరగాయల షాపుల్లో.. లేదంటే టమోటా పంటలపై పడి లూటీలకు తెగబడుతున్నారు. కర్నాటకలోని గోణి సోమనహళ్లిలో ధరణి అనే రైతు తనకున్న భూమిలో టమోటా పంట వేశాడు. అనుకున్నదాని కంటే పంట బాగా పండింది. వారం రోజుల్లో మార్కెట్‌కు తరలించాలని భావించాడు. కానీ ఈ లోగానే దొంగలు పంటనంతా లూటీ చేశారు. రూ. 1.50 లక్షల విలువ చేసే టమోటాలు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు ఉదయం పొలానికి వెళ్లి చూడగా చెట్లకు టమోటాల్లేవ్‌. చేతికొచ్చిన పంటను దొంగలు ఎత్తుకెళ్లారంటూ గుండెలు బాదుకున్నాడు ఆ కర్షకుడు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇక మహబూబాద్‌ జిల్లా డోర్నకల్‌లో వెజిటబుల్‌ షాప్‌ని టార్గెట్ చేసిన దొంగలు.. రాత్రి పక్కా ప్లాన్‌తో చోరీకి తెగబడ్డారు. వ్యాన్‌లో వచ్చిన దొంగలు టమోటాలతో పాటు నాలుగు రకాల కూరగాయల్ని ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కూరగాయల షాపుల్లో, పంటపొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి టమోటా దొంగలకు చెక్‌ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక పోలీసులు కూడా రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. చివరకు టమోటా దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ టీమ్‌లు రంగంలోకి దిగే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..