Telangana: ‘బీసీ బంధు’ దరఖాస్తు గడువు పెంచాలి.. బీసీ సంఘాల డిమాండ్..

|

Jun 20, 2023 | 7:25 AM

కుల వృత్తులకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. దాంతో.. ఇన్‌కమ్‌ సర్టిఫికెట్స్‌ కోసం ఆశావహులు మీసేవ సెంటర్లు, ఎమ్మార్వో కార్యాలయాల ముందు ఆందోళనలకు దిగారు. ఇక.. కరీంనగర్‌ జిల్లాలో ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం...

Telangana: ‘బీసీ బంధు’ దరఖాస్తు గడువు పెంచాలి.. బీసీ సంఘాల డిమాండ్..
Bc Bandhu
Follow us on

కుల వృత్తులకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. దాంతో.. ఇన్‌కమ్‌ సర్టిఫికెట్స్‌ కోసం ఆశావహులు మీసేవ సెంటర్లు, ఎమ్మార్వో కార్యాలయాల ముందు ఆందోళనలకు దిగారు. ఇక.. కరీంనగర్‌ జిల్లాలో ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఓ ఎమ్మార్వోను నిలదీశారు స్థానికులు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీసీ బంధు పథకానికి దరఖాస్తు చేసుకునేందు ఇవాళ ఒక్కరోజే అవకాశం ఉంది. దాంతో.. ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ల కోసం మీసేవా సెంటర్లకు జనాలు క్యూ కట్టారు. కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్లను తెచ్చుకునేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. మీసేవలో అప్లై చేసుకున్నా తహశీల్దార్​ఆఫీస్‌లకు వెళ్లి క్లియర్​చేసుకుంటే తప్ప మోక్షం కలుగడం లేదు. అయితే.. నేటి వరకే గడువు పెట్టడంతో అప్లై చేసుకోవడం కష్టంగా మారింది. దరఖాస్తుదారులకు అవసరమైన సర్టిఫికెట్ల అందజేయడంలో రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక.. అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.

కరీంనగర్ జిల్లా హుజరాబాద్‌లో కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యాన్ని నిరసిస్తూ తహశీల్దార్ కోమల్‌రెడ్డిని నిలదీశారు స్థానికులు. బీసీ కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ చివరి తేదీ కావడంతో నిన్న పెద్ద ఎత్తున తహశీల్దార్ ఆఫీస్‌కు వెళ్లారు ప్రజలు. అయితే.. సర్వర్ మొరాయించడంతో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కొద్దిరోజులుగా సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారంటూ తహశీల్దారును నిలదీశారు దరఖాస్తుదారులు.
గత కొద్దిరోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. మీ సేవ కేంద్రాల్లో సర్వర్ ప్రాబ్లంతో అనేక మంది కులం, ఆదాయం ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసివారు పది రోజులుగా రెవిన్యూ కార్యాలయాల చుట్టూ, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. అయితే.. నేటితో గడువు ముగుస్తుండటంతో సర్వర్‌ ప్రాబ్లమ్‌ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..