AP, Telangana News Live: నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. మోగిన సమ్మె సైరన్!
AP, Telangana, News Live: పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టతరంగా మారిందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తితో నిధుల విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ వారం రూ.600 కోట్లు.. దీపావళిని నాటికి మరో రూ.600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది..

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలప్రదమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యి చర్చించారు. పెండింగ్‌లో ఉన్న రూ.12 వందల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని.. పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టతరంగా మారిందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తితో నిధుల విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ వారం రూ.600 కోట్లు.. దీపావళిని నాటికి మరో రూ.600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
LIVE NEWS & UPDATES
-
ఆరోగ్య శ్రీ సమ్మెపై వెనక్కి తగ్గేదే లే.. అర్ధరాత్రి నుంచి సమ్మె యథాతథం!
ఈ రోజు (సెప్టెంబర్ 16) అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలకు బ్రేక్. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల సమ్మె యథాతథం. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా పట్టువీడని నెట్ వర్క్ ఆస్పత్రులు. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని పట్టుబడుతున్న నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్ స్పష్టం.
-
శ్రీశైలంలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత.. ముగ్గురి అరెస్ట్
నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత. ముగ్గురు నిందితుల అరెస్ట్. 297 తెలంగాణ మద్యం బాటిళ్లు సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు. శ్రీశైలం క్షేత్ర పరిసరాలలో కొనసాగుతున్న పోలీస్ అధికారుల తనిఖీలు.
-
-
మెట్రో రైళ్లో సెక్యూరిటీ గార్డులుగా 20 మంది ట్రాన్స్‌జెండర్లు
హైదరాబాద్ మెట్రో రైళ్లో సెక్యూరిటీ గార్డులుగా 20 మందికి ట్రాన్స్‌జెండర్లను నియమించారు. ఈ మేరకు వారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నియామక పత్రాలు అందించారు.
-
సీపీ సీవీ ఆనంద్‌కు హైకోర్టు నోటీసులు.. ఏం జరిగిందంటే?
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ న్యాయవిహార్ వద్ద ఇళ్ల నిర్మాణం కోసం పేలుళ్లపై కోర్టులో పిల్ దాఖలైంది. జస్టిస్ నగేశ్ భీమపాక రాసిన లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
-
ఆదాయానికి మంచిన ఆస్తులు.. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్!
ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నుంచి దాదాపు 15 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. ఇబ్రహీంబాగ్‌లో ఏడీఈగా పనిచేస్తున్న ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ACB అధికారులు తెలిపారు. శేరిలింగపంల్లిలో ఇళ్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు.. ఇతర భూమి పత్రాలను అధికారులు సీజ్ చేశారు.
-
-
‘తెలుగు వారికి NTR ఎంతో.. తెలంగాణకు KCR అంత’.. కేటీఆర్
కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. భద్రాచలం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలుగువారు ఉన్నారని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్. తెలంగాణ వారు ఉన్నారని చెప్పిన వ్యక్తి కేసీఆర్. ప్రతిపక్షాన్ని తొక్కాలి అంటే ఒక్కరు బయటతిరిగే వారు కాదు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డిని వదిలేశాం. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం చేయడంలో తప్పు చేశాం. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో విఫలం అయ్యాం. ఆ భాద్యత నేను తీసుకుంటాను. శిక్షణా తరగతులు పెట్టుకోవడంలో విఫలం అయ్యాం. పోయిన దీపావళికి బాంబులు పేలుతాయని పొంగులేటి చెప్పారు. ఈ దీపావళికి బాంబులు పేలలేదు. పొంగులేటి పెద్ద బిల్డప్. అడ్డిమారి గుడ్డిదెబ్బలో పొంగులేటి గెలిచారు. ఈ సారి పొంగులేటి పాలేరులో ఎట్లా గెలుస్తారో చూస్తా. తంతే గారెల బుట్టలో పడ్డట్లు పొంగులేటికి మంత్రి పదవి వచ్చింది. పొంగులేటి బీజేపీతో కుమ్మక్కు అయ్యారు. పోలీసులు, కలెక్టర్లు మీ వెంట తిరిగే రోజులు త్వరలోనే వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
-
AP Rains Upda: రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (సెప్టెంబర్ 17) కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. బుధవారం అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
-
నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 323 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం. ఆరోగ్య సంరక్షణ హాస్పిటల్స్ రాష్ట్ర ప్రెసిడెంట్ Dr వద్దిరాజు రాకేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేస్తున్నాం. దీంతో 323 ఆసుపత్రిలో నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు. రూ.1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. బకాయిలతో పాటు కోర్ కమిటీలో వైద్యులను చేర్చాలి. ఆరోగ్య శ్రీ సేవలు అందించిన 40 రోజుల్లో బిల్లు చెల్లించాలని ఆయన కోరారు.
-
6వ తరగతి బాలిక తలపై బ్యాగ్‌తో కొట్టిన టీచర్.. ఆనక భయంతో గోడ దూకి పరార్!
చిత్తూరులోని పుంగనూరు భాష్యం స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. 6వ తరగతి విద్యార్థిని 11 ఏళ్ల సాత్విక నాగశ్రీ తలపై బ్యాగ్ తో కొట్టిన ఉపాధ్యాయుడు సలీం భాషా. బాలిక తలకు తీవ్ర గాయం. పుర్రె ఎముక చిట్లినట్లు ఎక్స్ రేలో గుర్తింపు. ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం కు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి. నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి విజేత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్కూల్ గోడ దూకి టీచర్ పారిపోయినట్లు పోలీసుల గుర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
మెడికల్ షాప్‌లపై DCA ఆకస్మిక సోదాలు.. 167 మెడికల్ షాపులు సీజ్
హైదరాబాదులో మెడికల్ షాప్‌లపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు చేశారు. మొత్తం 167 మెడికల్ షాప్‌లలో లైసెన్సులు సస్పెండ్ చేసిన DCA. అబార్షన్ కిట్లు అమ్ముతున్న మెడికల్ షాపులపై DCA అధికారుల కోరడ. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా అబార్షన్ కిట్లను అమ్ముతున్న పలు మెడికల్ షాపులు గుర్తింపు. ఈ క్రమంలో మొత్తం 234 మెడికల్ షాప్‌లను DCA తనిఖీ చేసింది.
-
ఆ ప్రాంతంలో మాయమవుతున్న బైక్‌లు.. మాటు వేసిన పోలీసులకు చిక్కిన దొంగ
మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన సాధిక్ (35) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్‌ల వరుస చోరీలకు పాల్పడుతున్న సాధిక్ వద్ద నుంచి 10 బైకులు, స్కూటీలను సూరారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
మూసిలో ముగ్గురి యువకుల గల్లంతు.. 30 గంటలు దాటినా దొరకని ఆచూకీ!
మూసారాంబాగ్ మూసిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు. అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన ఇద్దరు, ముషీరాబాద్ లోని నాలలో కొట్టుకుపోయిన ఒక వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. డ్రోన్, బోట్ల సహాయంతో GHMC, DRF సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. నాలాలో కొట్టుకుపోయి 30 గంటలు దాటినా దొరకని యువకుల ఆచూకీ. అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన అర్జున్, రాము, ముషీరాబాద్ నాలాలో కొట్టుకుపోయి దినేష్. వీరి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూపులు.
-
సికింద్రాబాద్ మేధా స్కూల్ విద్యార్థుల కోసం దిగొచ్చిన విద్యాశాఖ
సికింద్రాబాద్ మేధా స్కూల్ విద్యార్థుల కోసం విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా అడ్మిషన్లు ఏర్పాటు చేశారు. వారికి అందిన లిస్టు ప్రకారం.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మరో స్కూల్ ఎంపిక చేసుకుంటే అడ్మిషన్ ఇప్పిస్తామంటూ విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. దీంతో ప్రశాంతంగా ఉన్న స్కూల్ ప్రాంగణం.
-
మణికొండ ఏడీఈ అంబేద్కర్ బినామీ ఇళ్లలోనూ ACb రైడ్స్
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. మణికొండలో ADE గా పనిచేస్తు భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అంబేద్కర్. ఆయన ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో 18 టీమ్స్ గా సోదాలు చేస్తున్న ఏసీబీ. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఏసీబీ దాడులు చేసింది. గచ్చిబౌలి ఎలక్ట్రికల్ ఏడీ అంబేద్కర్ ఏసీబీ దాడుల్లో చిక్కిన నేపథ్యంలో ఆయన బినామి ఇంటిపై ఏసీబీ దాడులు చేశారు. రామచంద్రాపురం మల్లికార్జున నగర్‌లో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, ఏడీ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.
-
మణికొండ ఏడీఈ ఇంట్లో ACB సోదాలు.. భారీగా బంగారం, నగదు సీజ్
ఏసీబీ దాడుల్లో మణికొండలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేసిన ఏసీబీ అధికారులు. భారీగా బంగారం పట్టివేత. బంగారం విలువను లెక్కిస్తున్న ఏసీబీ అధికారులు.
-
హైదరాబాద్‌లో పలుచోట్ల ACB ఆకస్మిక సోదాలు
హైదరాబాదులో పలచోట్ల ఏసీబీ ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏడిఈ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు. మణికొండలో ఏడీఈ గా పనిచేస్తున్న అంబేద్కర్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం15 టీమ్స్ గా ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు.
-
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు దరఖాస్తులు ఆహ్వానం..
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ నిర్వహించనున్నారు. ఇందులో ప్రజా పాలన, తెలంగాణ చరిత్ర–సంస్కృతి, పండుగలపై షార్ట్ ఫిల్మ్స్–పాటల పోటీలు జరగనున్నాయి. 40 ఏళ్ల లోపు యువ సృజనశీలులకు ఆహ్వానం పలుకుతూ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన వారు 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్స్, 5 నిమిషాల పాటలతో ఎంట్రీలు పంపాలి. ఎంట్రీలను youngfilmmakerschallenge@gmail.com లేదా WhatsApp: 8125834009 కు పంపాలి. ఎంట్రీలు పంపడానికి తుది గడువు సెప్టెంబర్ 30, 2025. ఇందులో ప్రథమ బహుమతి కింద రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతికి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.1 లక్ష, కన్సొలేషన్ బహుమతి రూ.20 వేల చొప్పున ఐదుగురికి అందజేస్తారు. అలాగే విజేతలకు ప్రశంసా పత్రం, జ్ఞాపిక కూడా ప్రదానం చేస్తారు. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటన విడుదల చేశారు.
-
Film on PM Modi’s Childhood: రేపు ప్రధాని మోదీ పుట్టిన రోజు.. మోదీ బాల్య జీవితంపై సినిమా ప్రదర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు రేపు. ఈ నేపథ్యంలో మోదీ బాల్యం ఆధారంగా నిర్మించిన ‘చలో జీతే హై’ (రండి, జీవితాన్ని గడుపుదాం) సినిమాను ప్రదర్శించడానికి పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రదర్శన చేపట్టారు. అక్టోబర్-నవంబర్లలో జరగనున్న బీహార్ రాష్ట్ర ఎన్నికల్లోనూ అధికారాన్ని చేపట్టాలని నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ కూటమి ముమ్మర ప్రచారం మొదలుపెట్టింది.
-
నిరుద్యోగులకు అలర్ట్.. నవంబరులో మళ్లీ ఏపీ టెట్ 2025 పరీక్ష
వచ్చే నవంబరులో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత మెగా డీఎస్సీలో మిగిలిన 406 పోస్టులను వచ్చే డీఎస్సీకి తీసుకువెళ్తామని, అలాగే ప్రత్యేక డీఎస్సీ కోసం కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
-
మరో 3 గంటల్లో పిడుగులతో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ
రాబోయే 3 గంటల్లో అల్లూరి సీతారామరాజు, విజయనగరంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. చెట్ల క్రింద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
-
ఇక తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీసుడే.. టీటీడీ ఛైర్మన్ మాస్ వార్నింగ్
తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తే జైలుకు పంపుతాం.. పనీపాటా లేని కొందరు తిరుమలపై అవాకులు చవాకులు పేలుతున్నారు. తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తే ఇక సహించేది లేదు. తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం. చిన్న విషయాలను పెద్దగా చేసి తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. నిత్యం స్వామివారి ఆలయంపై దుమ్మెత్తి పోస్తున్నారు. పోలీసులు, విజిలెన్స్‌తో చర్చలు జరుపుతున్నాం. యాక్షన్ చాలా సీరియస్‌గా ఉంటుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
-
రన్నింగ్‌కు దూరంగా ఉసేన్ బోల్ట్.. కేవలం ఇంటికే పరిమితం..!
8 సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత అయిన బోల్ట్ 2017లో క్రియాశీల పోటీల నుంచి రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్లు, 4×100 మీటర్ల రిలేలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 11 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఉసేన్ బోల్ట్ ఇప్పుడు మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇకపై పరుగులు తీయలేనని, తన సమయంలో ఎక్కువ భాగం ఇంట్లోనే గడుపుతున్నానని వెల్లడించాడు.
-
వరద నీటిలో ట్రాక్టర్ బోల్తా.. 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లోని దెహ్రాడూన్‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఉప్పొంగి ప్రవహిస్తోన్న టాన్స్ నదిలో ఓ ట్రాక్టర్ చిక్కుకుపోయి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లోని 10 మంది గల్లంతయ్యారు.
-
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఝరాసంగం మండలం ప్యాలవరానికి చెందిన నరసింహులుగా పోలీసులు గుర్తించారు.
-
టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. ఏవేంటంటే?
తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ నెల 23 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలపై చర్చించాం. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై చర్చించాం. ఈ నెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు. ఈసారి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం. ఈ నెల 24న ధ్వజారోహణ, అదేరోజు పెద్దశేష వాహన సేవ. సెప్టెంబర్ 24న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సీఎం చేతుల మీదుగా 2026 డైరీలు, క్యాలెండర్లు ప్రారంభోత్సవం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఇస్రో సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేస్తాం. ఇస్రో వారు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తారు. ప్రోటోకాల్ ఉన్నవారికి మాత్రమే వీవీఐపీ దర్శనం. గరుడ సేవ రోజు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
-
మూసీలో గుర్తు తెలియని మహిళ డెడ్‌బాడీ కలకలం..
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్‌లో మహిళ డెడ్ బాడీ కలకలం. గుర్తు తెలియని మహిళలను హత్య చేసిన దుండగులు. ఆత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం. మృత దేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలు స్వేకరిస్తున్నాయి. కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకి మహిళలను తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు. స్థానిక పరిసరాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు. 20 నుంచి 30 వరకు వయస్సు ఉన్న మహిళ.
-
నిద్రిస్తున్న భర్తపై.. వేడి వేడి నూనె పోసిన భార్య! ఆ తర్వాత..
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో నిద్రిస్తున్న భర్త వెంకటేశ్‌పై వేడి నూనె పోసింది భార్య పద్మ. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. సెప్టెంబర్ 11న ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేశ్‌పై భార్య పద్మ నూనె వేడి చేసి పోసింది.
-
సామాన్యులకు శుభవార్త
వినియోగదారులకు శుభవార్త చెప్పింది మదర్‌డైరీ. పాల ధరలో లీటరుకు రూ.2 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఇటీవల GST (వస్తువులు మరియు సేవా పన్ను) తగ్గించడం వల్ల కలిగే ప్రత్యక్ష ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మదర్ డెయిరీ తన పాలు, ఆహార ఉత్పత్తుల విభాగంలో ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. తగ్గించిన ధరలు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయని బ్రాండ్ తెలిపింది.
-
వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష
వివిధ శాఖల పనితీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. హోమ్, మున్సిపల్, జైళ్లశాఖలు పూర్తిగా పనిచేయడంలేదని, ఏ పనిలో ఉన్నా మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయాలని సూచించారు. రిపోర్టుల కోసం కలెక్టర్లను డిస్ట్రబ్ చేయొద్దని అన్నారు. RTGSను అడిగి తీసుకోవాలన్నారు చంద్రబాబు. అక్టోబర్ 2 నుంచి 100శాతం ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచాలని, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాని అన్నారు.
-
మరో టీమిండియా ప్లేయర్‌కు ఈడీ నోటీసులు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ED దూకుడుగా ప్రదర్శిస్తోంది. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పకు ED సమన్లు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రైనా, ధావన్‌ను ప్రశ్నించిన ED.. ఈనెల 24న హాజరు కావాలని సోనూసూద్‌కు పిలుపు అందింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై దర్యాప్తును వేగవంతం చేస్తోంది. ఈ కేసులో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం అంటే PMLA కింద దర్యాప్తు చేస్తోంది. రాబిన్ ఉతప్ప ప్రస్తుతం ఆసియా కప్ 2025లో వ్యాఖ్యాతగా ఉన్నారు.
-
Hyderabad: గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్‌మీట్
గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. తమపై ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలని అన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దు అని, మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దు కోరారు. మాకు న్యాయం చేయాలని గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ కోరుతున్నారు. మా పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని, రూ. 3 కోట్లు పెట్టి కొన్నారని ఆరోపణలు సరికాదని అన్నారు.
-
ప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతోంది. విలీనమా..? విమోచనమా.. అంటూ మరోసారి సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇది కచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ వేడుకలకు రెడీ అయింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండేళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ.. మరోసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో మూడో ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాబోతున్నారు.
-
అసోం పోలీసులకు చిక్కిన అవినీతి తిమింగలం..
అవినీతి ఆరోపణలతో అసోంలోని ఓ ఉన్నాతాధికారి ఇంట్లో సోదాలు చేస్తే.. ఏకంగా రెండు బ్యాగుల నిండా ఉన్న నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
— బ్యాగుల నిండా నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలు
— రూ.90లక్షల నగదు, కోటి విలువైన బంగారం సీజ్
— పోలీసుల అదుపులో ACS అధికారి నూపుర్ బోరా
— భూ కుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులపై ఆరా
— 2019లో అస్సాం సివిల్ సర్వీసెస్‌లో చేరిన నూపుర్ బోరా.. ప్రస్తుతం కామ్రూప్ జిల్లాలోని గోరోయిమారిలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
— బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలిండంతో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచారు పోలీసులు.
-
నటి దిశా పటానీ కుటుంబానికి సీఎం యోగి హామీ
UP: నటి దిశా పటానీ కుటుంబానికి ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఇటీవల దిశా ఇంటి ముందు కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం ఆరా తీశారు. దిశా తండ్రికి ఫోన్ చేసిన సీఎం యోగి.. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్నా పట్టుకొని తీరతామని హామీ ఇచ్చారు.
-
చిత్తూరు జిల్లా: ప్రైవేట్ స్కూల్‌లో దారుణం
Andhar Pradesh: ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రైవేట్ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థిని తలపై కొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఎక్స్‌రే తీశారు. పుర్రె ఎముక చిట్లినట్లు గుర్తించారు వైద్యులు.
-
హైదరాబాద్‌లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది అవినీతి నిరోధక శాఖ. 18 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
-
YS Jagan: చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు
వైసీపీ నేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ధరల పతనంలో ప్రభుత్వ రికార్డులు ఎవరికీ సాధ్యం కావని, కొనేవారు లేక పంటలను రైతులు రోడ్డుమీదే పారబోస్తున్నారని అన్నారు. కర్నూలు మార్కెట్లో ఉల్లిని వేలం వేయించినా ఎవరూ కొనడం లేదని, తక్షణం రైతుల పంటలను కొనుగోలు చేసి.. వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
-
వర్షం బీభత్సం.. ముగ్గురు మృతి..
మరోసారి హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో నదులు, వాగుల నీటి మట్టాన్ని అకస్మాత్తుగా పెంచాయి. ఈ భారీ వర్షాల కారణంగా ముగ్గురు మరణించారు. ధరంపూర్‌లో, మార్కెట్‌లోకి, బస్ స్టాండ్‌లోకి వరద నీరు ప్రవేశించింది. ధరంపూర్ బస్ స్టాండ్ పూర్తిగా మునిగిపోయింది. అక్కడ నిలిపి ఉంచిన అనేక బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. మార్కెట్‌లోని డజన్ల కొద్దీ దుకాణాలు, స్టాళ్లు కూడా వరద ముంపులో చిక్కుకున్నాయి. ప్రజల ఇళ్ళు మోకాళ్ల వరకు నీటితో నిండిపోయాయి. అన్ని వస్తువులు నాశనమయ్యాయి.
-
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
తెలంగాణలోనూ ఇవాళ అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా EHS, JHS బకాయిలు ఇవ్వలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి.
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. అల్పపీడనం బలహీనపడిందని.. దీని ప్రభావతంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం తూర్పు తెలంగాణ సమీపంలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది.. సముద్రమట్టం నుండి 3.1 కి మీ ఎత్తువరకు కొనసాగుతూ.. ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉందని పేర్కొంది..
-
అనంత్ అంబానీ వంతారాకు బిగ్ రిలీఫ్…సుప్రీంకోర్టులో ఊరట
ఏనుగుల తరలింపు వ్యవహారంలో అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రూల్స్‌ను పాటిస్తూ.. వంతారాకు ఏనుగులను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గుజరాత్ జామ్‌నగర్‌లోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాకు ఏనుగులను తరలించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా వంతారా సంస్థకు క్లీన్‌చిట్ ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గుర్తు చేసింది. అలాగే వంతారా సంస్థలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి ఓనర్లకు తిరిగి ఇవ్వడానికి ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సీ.ఆర్. జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ సరిగా లేదంటూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇక వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
-
APలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి. 2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ సమస్య పరిష్కారానికి వారంరోజుల గడువు విధించాయి.
-
తెలంగాణలో ఇవాళ్టినుంచి యథావిధిగా కాలేజీలు
తెలంగాణలో ఇవాళ్టినుంచి యథావిధిగా కాలేజీలు కొనసాగనున్నాయి. ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో లైన్ క్లీయర్ అయ్యింది. ఈ వారం 600 కోట్లు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
-
హైదరాబాద్ నాలాల్లో కొనసాగుతున్న గాలింపు
హైదరాబాద్ నాలాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాలాల్లో ముగ్గురు గల్లంతు కావడంతో గాలింపు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ముగ్గురి ఆచూకీ లభించలేదు. 2 టీమ్‌లతో DRF బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
-
ఉత్తరాఖాండ్‌లో మళ్లీ వర్ష బీభత్సం కొనసాగుతోంది.
ఉత్తరాఖాండ్‌లో మళ్లీ వర్ష బీభత్సం కొనసాగుతోంది. డెహ్రాడూన్‌లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డెహ్రాడూన్ సమీపంలో తమ్సా నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తమ్సా నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. పెరుగుతున్న నీటిమట్టం తీర ప్రాంతాల ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీటిలోనే నానుతున్నాయి. నీటి మట్టం రోజురోజుకు మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
-
హైదరాబాద్‌లో ఏసీబీ స్పెషల్ ఆపరేషన్
హైదరాబాద్‌లో ఏసీబీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఉదయం 5గంటల నుంచి నగర వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు ACB అధికారులు.18 బృందాలుగా విడిపోయి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో మణికొండలో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు ఏడీఈ అంబేద్కర్‌పై గతంలోనే ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఏడీఈ అంబేద్కర్ నివాసం, ఆఫీస్‌తోపాటు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లోనూ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది ACB.
-
యూరియా కోసం బారులు
మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా లారీ రావడంతో ఉదయం నాలుగు గంటల నుంచే క్యూ లైన్‌లో నిల్చున్నారు. 15 రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని, సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
-
రష్యా పౌరులకు చైనా బంపర్ ఆఫర్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న టారిఫ్‌ల నిర్ణయం వల్ల ఇప్పటికే రష్యా, అమెరికా మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో అమెరికాతో సరిసమానంగా ఎదుగుతోన్న చైనాతో మైత్రి పెంచుకుంటోంది రష్యా. దానికి తగ్గట్టుగానే ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది చైనా. తాజాగా రష్యాకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడాది పాటు రష్యన్లకు చైనా వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 15, 2025 నుంచి సెప్టెంబర్ 14, 2026 వరకు అమల్లో ఉంటుంది.
-
ఐటీఆర్ గడువు పొడిగింపు
2025-26 సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని సెప్టెంబర్ 15, 2025 నుండి సెప్టెంబర్ 16, 2025 వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో తెలిపింది.
KIND ATTENTION TAXPAYERS!
The due date for filing of Income Tax Returns (ITRs) for AY 2025-26, originally due on 31st July 2025, was extended to 15th September 2025.
The Central Board of Direct Taxes has decided to further extend the due date for filing these ITRs for AY… pic.twitter.com/jrjgXZ5xUs
— Income Tax India (@IncomeTaxIndia) September 15, 2025
-
రైతులకు గుడ్ న్యూస్
యూరియా కొరతతో ఇబ్బందులు పడుతోన్న రైతులకు గుడ్ న్యూస్. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తితో అదనంగా యూరియా కేటాయింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలప్రదమయ్యాయి.
Published On - Sep 16,2025 6:47 AM
