Tiger Fear in Telangana: ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి హల్‌చల్.. జనం చూస్తుండగానే ఆవును చంపిన బెబ్బులి..
ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి మరోసారి హల్‌చల్ చేసింది. పశువుల కాపరులను పరుగులు పెట్టించింది. అందరూ చూస్తుండగానే ఆవును చంపి తినేసింది.
Tiger Fear in Telangana: ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి మరోసారి హల్‌చల్ చేసింది. పశువుల కాపరులను పరుగులు పెట్టించింది. అందరూ చూస్తుండగానే ఆవును చంపి తినేసింది. ఈ ఘటన పెనుగంగా తీరం గొల్లఘాట్ శివారులో చోటు చేసుకుంది. కాగా, రెండు రోజుల క్రితమే తాంసి-కె శివారులో లేగదూడను పులి హతమార్చింది. బుధవారం నాడు మరో ఆవును గొల్లఘాట్ శివారులో వేటాడి చంపేసింది. ఇవాళ ఉదయం రైతులు తమ పంట చేలకు వెళుతుండగా పులి కంటపడింది. వారి కళ్ల ముందే ఆవుపై దాడి చేసి చంపేసింది. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. అయితే వరుస పులి దాడులతో భీంపూర్ మండలంలోని గొల్లఘాట్, తాంసి-కె, పిప్పల్ కోటి, నిపాని, గుంజాల గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. పులి సంచారంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పులిని ఎలాగై బందించాలంటూ అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. కాగా, అటవీ సమీపంలోకి పశువులను తీసుకెళ్లవద్దని రైతులను అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే రైతులు గుంపులు గుంపులుగా మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.
Also read:
స్వదేశీ నిధులతోనే శ్రీరాముడి గుడి నిర్మాణం.. కీలక నిర్ణయం తీసుకున్న శ్రీరామ జన్మభూమి ట్రస్ట్
New Act in Gujarat: కీలక చట్టం తీసుకువచ్చిన గుజరాత్.. ఇకపై భూకబ్జాలకు పాల్పడిన వారికి చుక్కలే..