గల్ఫ్‌లో హైదరాబాద్ పాతబస్తీ మహిళల గోస, అరబ్ షేక్ ల అకృత్యాలు, ట్రావెల్ ఏజెంట్ల దగాపై సెల్ఫీ వీడియోల్లో మొర
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహిళలు దుబాయ్‌లో నానాకష్టాలు పడుతున్నారు. ట్రావెల్ ఏజెంట్లు మోసం చేయడంతో చిత్రహింసలకు గురవుతున్నట్టు బాధితులు..
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహిళలు దుబాయ్‌లో నానాకష్టాలు పడుతున్నారు. ట్రావెల్ ఏజెంట్లు మోసం చేయడంతో చిత్రహింసలకు గురవుతున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు, కేంద్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ప్రాధేయపడుతూ సెల్ఫీ వీడియోలు తమ బంధువులకు పంపించారు. నాలుగు రాళ్ళు వెనుకేసుకుందామన్న ఆశ, బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన పాతబస్తీకి చెందిన ముస్లిం మహిళల కష్టాలివి. దుబాయ్ షేక్ లు తమను ఇక్కడ నరకయాతన పెడుతున్నారని, తమకు మాయమాటలు చెప్పి దుబాయ్ పంపిన ట్రావెల్ ఏజెంట్లు నిలువునా ముంచారని వాళ్ళు ఆ వీడియోలలో మొరపెట్టుకున్నారు. షేక్‌ల బారినుంచి తమను ఆదుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని సెల్ఫీ వీడియోలో సదరు మహిళలు అభ్యర్థిస్తున్నారు.