ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్ కు అంతర్జాతీయ గౌరవం.. గ్రీన్‌బర్గ్‌ అవార్డుల్లో ఔట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ విభాగంలో పురస్కారం

ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్ కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్ ఖాతాలో మరో పురస్కారం చేరింది.

ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్ కు అంతర్జాతీయ గౌరవం.. గ్రీన్‌బర్గ్‌ అవార్డుల్లో ఔట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ విభాగంలో పురస్కారం
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 17, 2020 | 5:57 AM

ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్ కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్ ఖాతాలో మరో పురస్కారం చేరింది. ప్రఖ్యాత గ్రీన్‌బర్గ్‌ ఔట్‌స్టాండింగ్‌ ఎచీవ్‌మెంట్‌ పురస్కారం ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్ కు దక్కింది. పేదలకు అందిస్తున్న సేవలకుగాను ఈ పురసరం దక్కించుకుంది ఎల్‌వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అనుసరించిన ప్రణాళికకు గ్రీన్‌బర్గ్‌ అవార్డుల్లో ఔట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ విభాగంలో పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని ఫౌండర్‌, చైర్మన్‌ డాక్టర్‌ గుళ్లపల్లి నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..సేవ చేయాలనే బలమైన కోరిక మనసులో ఉంటే సాధించలేనిది ఏదీలేదన్నారు. అదేవిధంగా అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ కాటరాక్ట్‌ అండ్‌ రిప్రాక్టివ్‌ సర్జరీ అందించే ప్రతిష్టాత్మక హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డుకు డాక్టర్‌ గుళ్లపల్లి నాగేశ్వరరావు ఎంపికయ్యారు.