Tiger Attack: ఇటీవల కాలంలో వన్యమృగాలు జనావాసంలోకి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే పులుల దాడులకు సంబంధించిన ఘటనలు నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. పులుల దాడులతో ఏజన్సీ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరి వ్యక్తులపై పులి దాడికి ప్రయత్నించింది. ఈ ఘటన కొమురంభీం జిల్లాలో జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరి వ్యక్తుల పై ఓ పులి దాడికి యత్నించింది. బైక్ పై ముర్లిగూడ సర్పంచ్ ఈశ్వరి మరో వ్యక్తి.. కాగజ్ నగర్ నుండి ముర్లిగూడ వెళుతుండగా కమ్మర్‌గాం సమీపంలో ఒక్కసారిగా పులి దాడి చేసింది. దాంతో వారు బైక్ పై నుంచి పడిపోయారు.
పులిని గమనించిన ఈశ్వరి, మరో వ్యక్తి పెద్దగా అరుపులు, కేకలు వేయడంతో అది భయపడి అడవిలోకి పారిపోయింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సర్పంచ్ ఈశ్వరి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు. కాగజ్ నగర్ పెంచికల్ పేట మద్య సాయంత్రం ఆరుగంటల తరువాత రాకపోకలు మానుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సంఘటన జరిగిన, పులి ఆనవాళ్లు కనిపించిన తమకు తెలియజేయాలని అటవీశాఖ అధికారులు అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :