ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమి.. ఒకేరోజు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు.. వారెవరంటే?

ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు తమ టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమి.. ఒకేరోజు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు.. వారెవరంటే?
Test Cricket
Follow us

|

Updated on: Aug 13, 2021 | 5:44 PM

క్రికెట్ అనేది సంచలనాలకు మారుపేరుగా నిలిచే ఆట. ఇందులో అనేక యాదృచ్చికాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు క్రీడాకారులు తమ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించి, లెజెండ్స్‌గా మారారు. ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, 10 మందికి పైగా ఆటగాళ్లు తమ టెస్ట్ అరంగేట్రం చేశారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ టెస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు ప్రముఖ క్రికెట్ దిగ్గజాలు తమ కెరీర్‌కు వీడ్కోలు పలకడం. అయితే ఈ ముగ్గురు కూడా భిన్నమైన వారే. ఒకరు వికెట్ కీపర్ కాగా, ఒకరు బౌలర్, మరొకరు బ్యాట్స్‌మన్.. ఈ ముగ్గురు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై ఈ ముగ్గురు అరుదైన వ్యక్తులు కలిసి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

వాస్తవానికి, సిరీస్‌లో ఐదవ టెస్ట్ ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య 1991 సంవత్సరంలో ఆగస్టు 8 నుంచి 12 ఆగస్టు వరకు ఓవల్ మైదానంలో జరిగింది. ఇందులో పాల్గొన్న వెస్టిండీస్ వెటరన్ వికెట్ కీపర్ జెఫ్ డుజోన్, ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్, వివ్ రిచర్డ్స్‌కు ఇది చివరి టెస్ట్ మ్యాచ్‌గా మారింది. జెఫ్ తన కెరీర్‌ను 272 వికెట్లతో ముగించాడు. మార్షల్ కూడా 376 వికెట్లు సాధించాడు. అదే సమయంలో, రిచర్డ్స్ 50 కంటే ఎక్కువ టెస్ట్ బ్యాటింగ్ సగటుతో తన కెరీర్‌ను ముగించాడు. కానీ ఈ ముగ్గురు దిగ్గజాల చివరి టెస్టులో, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు విజయం సాధించిడం విశేషం. దీంతో ఈ సిరీస్ డ్రాగా ముగిసింది.

మ్యాచ్ ఫలితం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 419 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో రాబిన్ స్మిత్ 109, కెప్టెన్ గ్రాహం గూచ్ 60, హెచ్. మారిస్ 44 పరుగులు సాధించారు. క్రిస్ లూయిస్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఎల్క్ స్టీవర్ట్, ఇయాన్ బోథమ్ ఇద్దరూ 31 పరుగులు సాధించారు. విండీస్ తరఫున కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో, వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 176 పరుగులకు ఆలౌట్ అయింది. డెస్మండ్ హేన్స్ అజేయంగా 75 పరుగులు చేశాడు. అతనితో పాటు క్లేటన్ లాంబెర్ట్ 39 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ తరఫున ఫిల్ తుఫ్నెల్ 6 వికెట్లు తీశాడు. ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ టీం 375 పరుగులు చేసింది. ఈసారి రిచీ రిచర్డ్సన్ 121 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేయగా, కెప్టెన్ వివ్ రిచర్డ్స్ 60, కార్ల్ హూపర్ 54 పరుగులు సాధించారు. డెస్మండ్ హేన్స్ 43 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరఫున డేవిడ్ లారెన్స్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Also Read: ఒలింపిక్స్ ముగిసిన తరువాత లైవ్.. ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ప్రసారం చేసిన ఉత్తర కొరియా.. ఇదేంటంటూ నెటిజన్ల కామెంట్లు

IND vs ENG 2nd Test Day 2 Live: లంచ్ బ్రేక్.. టీమిండియా స్కోర్ 346/7.. క్రీజులో జడేజా 31 , ఇషాంత్