13 బంతులు.. 400 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బౌలర్లకు దడ పుట్టించిన బ్యాట్స్‌మెన్.. క్రికెట్ లీగ్‌లో ఓ జట్టు ప్రపంచ రికార్డు.. ఎక్కడంటే?
ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చిన వెంటనే బౌలర్లపై దాడి మొదలెట్టాడు. ఫలితంగా అతను కేవలం 13 బంతుల్లో 400 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
నేటి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 200 పరుగులు సాధించడం పెద్ద విషయమేవి కాదు. కానీ, క్రికెట్ లీగ్‌లో మాత్రం ప్రపంచలోనే మొదటిసారి ఓ క్రికెటర్ సహాయంతో ఒక జట్టు డబుల్ హండ్రెడ్ రాటేసింది. 33 ఏళ్ల బ్యాట్స్‌మన్ కేవలం 13 బంతుల్లో 400 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి లీగ్‌లోనే తన జట్టును మొదటిసారి 200 పరుగులు దాటించారు. ఇంగ్లండ్‌లో ఆడుతున్న హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఇది సాధ్యమైంది. నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ వర్సెస్ మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట ఆడుతున్న నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ జట్టు హండ్రెడ్‌లో మునుపెన్నడూ కనిపించని స్కోర్ బాదేసింది.
మ్యాచ్‌లో, నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. 100 బంతుల్లో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. అయితే మొదట్లో నార్తరన్ సూపర్‌ఛార్జర్‌లు ఆరంభం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ 21 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది. ఆరో బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన జాన్ సింప్సన్‌తో ఆట పూర్తిగా మారిపోయింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ బౌలర్లపై 253 స్ట్రైక్ రేట్‌తో సింప్సన్ దాడి చేశాడు. ఈ మ్యాచ్‌లో జాన్ సింప్సన్ మొత్తం 28 బంతులు ఆడాడు. ఇందులో అతను 400 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 13 బంతులను ఆడాడు.
33 ఏళ్ల బ్యాట్స్‌మెన్ పరుగుల సునామీ సృష్టించాడు 33 ఏళ్ల జాన్ సింప్సన్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్. అతను క్రీజులో అడుగుపెట్టినప్పుడు, జట్టు స్కోరు 65 బంతుల్లో 4 వికెట్లకు 106 పరుగులు. ఆతర్వాత స్కోరు 200 పరుగులకు చేరుకుంది. ఎందుకంటే ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ సింప్సన్ కేవలం 28 బంతుల్లో 253.57 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 71 పరుగులు చేశాడు. సింప్సన్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అంటే అతను కేవలం 13 బంతుల్లో తన సూపర్బ్ ఇన్నింగ్స్‌తో 56 పరుగులు సాధించాడు. అది కూడా 400 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో కావడం విశేషం.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు.. కేవలం 99 బంతుల్లో 131 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమి.. ఒకేరోజు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు.. వారెవరంటే?
IND vs ENG 2nd Test Day 2 Live: లంచ్ తరువాత మొదలైన సెకండ్ సెషన్.. క్రీజులో జడేజా, ఇషాంత్