ఒలింపిక్స్ ముగిసిన తరువాత లైవ్.. ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ప్రసారం చేసిన ఉత్తర కొరియా.. ఇదేంటంటూ నెటిజన్ల కామెంట్లు
టోక్యో ఒలింపిక్స్ 2020 రికార్డ్ చేసిన ఫుటేజీలను ఉత్తర కొరియా స్టేట్ టెలివిజన్ మంగళవారం (ఆగస్టు 10) ప్రసారం చేసింది. అయితే, ఒలింపిక్స్ ముగిసిన రెండు రోజుల తరువాత దీనిని ప్రసారం చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
టోక్యో ఒలింపిక్స్ 2020 రికార్డ్ చేసిన ఫుటేజీలను ఉత్తర కొరియా స్టేట్ టెలివిజన్ మంగళవారం (ఆగస్టు 10) ప్రసారం చేసింది. అయితే, ఒలింపిక్స్ ముగిసిన రెండు రోజుల తరువాత దీనిని ప్రసారం చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకిలా చేసిందంటూ నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు.
స్థానిక మీడియా నివేదికల మేరకు, కొరియా సెంట్రల్ టెలివిజన్ (KCTV) జులై 21న జరిగిన మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్ యునైటెడ్ కింగ్‌డమ్ (గ్రేట్ బ్రిటన్), చిలీ టీంల మధ్య జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ను ఆగస్టు 10న ప్రసారం చేసింది. దాదాపు 70 నిమిషాల పాటు ఈ ప్రసారం చేసింది. అయితే, ఈ మ్యాచులో గ్రేట్ బ్రిటన్ టీం 2-0తో చిలీపై విజయం సాధించింది. 95 నిమిషాలపాటు జరగిన ఈ మ్యాచులో ఆరంభం నుంచి చిలీపై ఆధిపత్యం చూపించింది.
కాగా, ఈ మ్యాచ్ ఫుటేజ్ ఎలా సేకరించారో మాత్రం వెల్లడించలేదు. ఈ మ్యాచును ఎలాంటి కామెంట్రీ లేకుండానే ప్రసారం చేసింది. అలాగే నాణ్యత కూడా చాలా పేలవంగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. చైనా, బ్రెజిల్ మధ్య మరొక మ్యాచ్‌ను కూడా ప్రసారం చేయాలని భావించిందని, అయితే దానిపై ఎలాంటి సమాచారం అందించలేదని తెలుస్తోంది.
అయితే, ఉత్తర కొరియా.. ఒలింపిక్స్ లేదా ఇతర అంతర్జాతీయ క్రీడల కవరేజీలను ప్రసారం చేయడంలో ఎంతో జాప్యం ప్రదర్శింస్తుందని పలువుర అంటున్నారు. చాలా సందర్భాలలో ఇలాంటి మెగా ఈవెంట్‌లు జరిగిన వారం లేదా నెలలు లేదా కొన్నిసార్లు సంవత్సరం తరువాత కూడా ప్రసారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటా.
రియో డి జనీరోలో 2016 సమ్మర్ ఒలింపిక్స్ సందర్భంగా ఇలానే చేసింది. క్రీడల ప్రారంభ తరువాత నాలుగు రోజులకు పలు ఆటలను కవర్ చేసింది.
టోక్యో క్రీడలకు ఉత్తర కొరియా అథ్లెట్లతోపాటు ప్రతినిధులను కూడా పంపలేదు. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వల్ల ఈ సారి ఆటల్లో భాగస్వామ్యం కావడం లేదంటూ చెప్పడం గమనార్హం. ఈమేరకు ప్రపంచంలో నెలకొన్న కోవిడ్ సంక్షభం నుంచి దేశ క్రీడాకారులను కాపాడేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించడం విడ్డూరం.
అయితే, గతంలోనూ ఓసారి ఇలానే ఉత్తర కోరియా క్రీడలకు దూరంగా ఉన్న సందర్భం ఒకటి ఉంది. 33 ఏళ్ల క్రితం ఉత్తర కొరియా 1988 లో సమ్మర్ ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు. దాటవేసింది. అయితే ఇప్పటి వరకు పది సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆదేశ క్రీడాకారులు మొత్తం 57 పతకాలను సాధించారు. ఇందులో 16 బంగారు పతకాలు ఉన్నాయి.
టోక్యో ఒలింపిక్స్ 2020 జులై 23 న ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 8 న ముగిసాయి. కోవిడ్‌తో ఎన్నో ఆంక్షలతో ఈ క్రీడలను నిర్వహించారు. అయితే గతేదాడి జరగాల్సిన ఈ క్రీడలు కరోనాతో 2021కి వాయిదా పడ్డాయి. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 7 పతకాలను సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.
Also Read: IND vs ENG 2nd Test Day 2 Live: 300 పరుగులకు చేరిన టీమిండియా స్కోర్.. రిషబ్ 19, జడేజా 1 బ్యాటింగ్