KL Rahul: నా బర్త్‌డే గిఫ్ట్ అదిరింది రాహుల్ బాబా..! కాబోయే మామ కాంప్లిమెంట్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న బాలీవుడ్ నటుడి పోస్ట్

లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండవ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్‌) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

KL Rahul: నా బర్త్‌డే గిఫ్ట్ అదిరింది రాహుల్ బాబా..! కాబోయే మామ కాంప్లిమెంట్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న బాలీవుడ్ నటుడి పోస్ట్
Kl Rahul And Sunil Shetty
Follow us
Venkata Chari

|

Updated on: Aug 13, 2021 | 3:24 PM

KL Rahul: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండవ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్‌) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. లార్డ్స్‌లో సెంచరీ చేయాలని ఎంతో మంది క్రికెటర్లు కలకంటారు. అలాంటి స్టేడియంలో కేఎల్ రాహుల్ తన తొలి సెంచరీ నమోదు చేసి, మొత్తంమీద మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు. అతను సెంచరీ నమోదు చేసినప్పుడు తొటి ఆటగాళ్లతో సహా చాలామంది కేఎల్ రాహుల్‌కు శుభాకాంక్షలు అందించారు. సోషల్ మీడియాలో కూడా రాహుల్‌ను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో రాహుల్ ప్రియురాలు అతియాశెట్టి, ఆమె తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా చేరారు. ఈమేరకు ఆయన సెంచరీ చేసిన వీడియో క్లిప్‌ను జోడిస్తూ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. క్రికెట్‌కి పుట్టినిల్లైన లార్డ్స్‌ మైదానంలో సెంచరీ నమోదు చేశావు కంగ్రాట్స్ బాబా.. నా పుట్టిన రోజుకు మంచి బహుమతి ఇచ్చావు అంటూ కామెంట్ చేశాడు. సునీల్‌ శెట్టి ఇన్‌స్టా పోస్ట్‌పై నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అలాగే రాహుల్ ప్రేయసి అతియా శెట్టి కూడా కేఎల్ రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హార్ట్ సింబల్‌ను పోస్ట్ చేసింది.

అయితే, వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ కోసం రాహుల్‌తో పాటు ఆయన ప్రియురాలు అతియా శెట్టి కూడా ఇంగ్లండ్‌ వెళ్లిన సంగతి తెలసిందే. ఈమేరకు వారి ఫొటోలు కూడా నెట్టింట్లో బాగానే సందడి చేశాయి. కాగా, రాహుల్‌ అతియాను త‌న పార్టన‌ర్‌‌గా పరిచయం చేయడం విశేషం. ఈ జోడీ గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సునీల్ శెట్టి కూడా వీళ్ల ప్రేమకు పచ్చ జెండా ఊపారంట. అందుకే ఇలా కామెంట్లు పంచుకున్నాడంటూ నెటిజన్లు అంటున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. కేఎల్‌ రాహుల్‌ అజేయమైన శతకంతో పాటు మరో ఓపెనర్ రోహిత్‌ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. పుజారా(9) మాత్రం మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్‌తో పాటు రహానే(1) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌ 2, రాబిన్సన్‌కు ఓ వికెట్‌ పడగొట్టాడు.

Also Read: Azhariddin: ఆజారుద్దీన్ దేశ ద్రోహి.. అవకతవకలపై ప్రశ్నిస్తే.. పరువ నష్టం దావా వేస్తారాః టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి

Tokyo Olympics: ఒలింపిక్ పతకాన్ని కోల్పోయిన ఆటగాళ్లకు టాటా మోటార్స్ బహుమతి.. నాల్గవ ర్యాంక్ ఆటగాళ్లకు కార్లు..