Telangana: అంగన్వాడి టీచర్ నిర్లక్ష్యం.. ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డ మూడేళ్ల చిన్నారి..

|

Mar 02, 2023 | 9:40 AM

ఓ చిన్న నిర్లక్ష్యం పసిపిల్ల ప్రాణాలు తీసేది. అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది కానీ లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లిలో

Telangana: అంగన్వాడి టీచర్ నిర్లక్ష్యం.. ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డ మూడేళ్ల చిన్నారి..
Anganwadi Center
Follow us on

ఓ చిన్న నిర్లక్ష్యం పసిపిల్ల ప్రాణాలు తీసేది. అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది కానీ లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లిలో అంగన్‌వాడీల నిర్వాకం అభం శుభం తెలలియని పసిపిల్లని ఒకటీ రెండు కాదు ఆరు గంటలపాటు చీకటి గదిలో బందీని చేసింది. పసిపిల్లని అంగన్‌వాడీ కేంద్రంలో మర్చిపోయి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయింది టీచర్‌. అంగన్‌ వాడీ కేంద్రంలోనే ఏడ్చి ఏడ్చి పసిబిడ్డ నరకయాతన అనుభవించింది ఆ చిన్నారి.

సంగారెడ్డి.. ఖాజీపల్లిలో విజయలక్ష్మి, మల్లప్పల కూతురు మూడేళ్ళ చిన్నారి అక్కతో పాటు వెళ్ళి అంగన్‌వాడీ కేంద్రంలో కూర్చుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అంగన్‌వాడీ టీచర్‌ కృష్ణవేణి ఇంటికి వెళ్ళిపోగా, ఆయా జ్యోతి లోపల ఎవరున్నారనే విషయం చూడకుండా తాళం వేసి వెళ్ళిపోయింది. కూలిపనికి వెళ్ళొచ్చిన తల్లి తన కూతురి కోసం వెతగ్గా కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పసిబిడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్నట్టు గ్రహించి తాళాలు తీశారు. రాత్రి దాదాపు 9 గంటలకు పసిబిడ్డని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఆ పాప అపస్మారక స్థితికి చేరింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాధ్యులైన టీచర్‌కీ, ఆయాకీ నోటిసులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..