Child Missing: ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మాయం.. సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులే షాక్!

ఇటీవల కాలంలో వరుస శిశువుల మాయం ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల కేంద్రంగా కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కరీంగనర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సేమ్ సీన్ రిపీటైంది. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో మూడురోజుల శిశువు అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Child Missing: ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మాయం.. సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులే షాక్!
Child

Edited By:

Updated on: Feb 18, 2024 | 4:51 PM

ఇటీవల కాలంలో వరుస శిశువుల మాయం ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల కేంద్రంగా కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కరీంగనర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సేమ్ సీన్ రిపీటైంది. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో మూడురోజుల శిశువు అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

ఫిబ్రవరి 16వ తేదీన బీహార్ రాష్ట్రం ముజఫర్ జిల్లాకు చెందిన నిర్మలాదేవి పురిటి నొప్పులతో కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం కావడంతో జనరల్ వార్డుకు తరలించారు వైద్య సిబ్బంది. అయితే తల్లికి కొంత ఫిట్స్ లాగా రావడంతో ఇంటెన్సివ్ కేర్‌లోకి మార్చారు. దీంతో ఆమె భర్త మనోజ్ రామ్ అన్న కొడుకును శిశువు వద్ద బాగోగులు చూసుకునేందుకు ఉంచారు. కానీ, తీరా చూస్తే మూడురోజుల ఆడ శిశువు కనిపించకుండా పోయింది. దాంతో మనోజ్ రామ్, ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి ఈ ఘటన జరగ్గా 18వ తేదీన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆడ శిశువు వద్ద కాపలాగా ఉన్న మనోజ్ రామ్ సోదరుడి కుమారుడే శిశువును తీసుకెళ్ళి బయట మరో అమ్మాయికి ఇస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రాథమికంగా మనోజ్ రామ్ కుటుంబ సభ్యుల పాత్రే ఈ అదృశ్యం వెనుక ఉందని నిర్ధారించుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అయితే అప్పటి నుంచి కనిపించకుండాపోయిన అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మనోజ్ రామ్ కుటుంబీకులు కరీంనగర్ శివారులోని బావుపేట గ్రానైట్ క్వారీలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ వివరాలు వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రిలో ఏం జరుగుతుందో కనీసం పర్యవేక్షణ లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…