Errabelli Dayakar Rao: ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. వీడియో చూశారా..?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా ముగిసింది. ఈ క్రమంలోనే.. ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. దీంతో మాజీమంత్రికి ఏమైంది. అన్న చర్చ టాక్‌ ఆఫ్‌ ది తెలంగాణగా మారింది. అసలు తొర్రూరులో గతంలో ఏం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతోంది. మీకు తెలియాలా? అయితే ఈ స్టోరీ చూసేయండి..

Errabelli Dayakar Rao: ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. వీడియో చూశారా..?
Errabelli Dayakar Rao

Updated on: Feb 18, 2026 | 9:22 AM

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు కథ వేరే ఉండే.. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక రోజు మరో కథ ఉండే.. ఆరోజు ఫుల్ హ్యాపీ.. ఎన్నిక రోజు భావోద్వేగం.. ఈ రెండు సీన్లకు మధ్యలో ఏం జరిగిందంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. మహబూబాబాద్ తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16వార్డులకు గాను.. 9చోట్ల BRS విజయం సాధించింది. అధికార కాంగ్రెస్‌ 7స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో చేరిందని ఎర్రబెల్లి దయాకర్ రావు హాపీగా ఫీలై డ్యాన్స్‌ కూడా చేసేశారు.

అయితే, రెండు ఎక్స్ అఫీషియో మెంబర్లతో.. తన బలాన్ని 9కి పెంచుకుంది కాంగ్రెస్‌. రెండు పార్టీలకు సమానబలం ఉండటంతో.. తొర్రూరులో లక్కీ డ్రా నిర్వహించారు అధికారులు. ఈ డ్రాలో మున్సిపల్‌ చైర్మ్‌ పదవి కాంగ్రెస్‌కు దక్కింది. మరోవైపు చైర్మన్ ఎన్నిక సందర్భంగా తాను లోనికి వెళ్లనీయకుండా పోలీసులు మున్సిపల్ ఆఫీస్‌కు తాళం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి.. గేటు బయట ఉండిపోయిన ఎర్రబెల్లి భావోద్వేగానిక గురయ్యారు.

వీడియో చూడండి..

తిండితిప్పలు మాని పార్టీకోసం కష్టపడిన కార్యకర్తలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని బోరున విలపించారు ఎర్రబెల్లి.. రాజకీయాల్లో ఉండాలా వద్దా అంటూ ప్రశ్నించారు. పోలీసులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని వాపోయారు దయాకర్ రావు.

ఎర్రబెల్లి కంటతడి పెట్టడం చూసి బీఆర్ఎస్ నేతలు కూడా బాధపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us