బస్టాండ్‌లో తేడాగా కనిపించిన ఇద్దరు యువకులు.. ఆపి చెక్ చేయగా..

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి బ్యాచ్‌ మాత్రం చెలరేగిపోతూనే ఉంది. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్న ప్రతిసారీ కిలోలకొద్ది గంజాయి పట్టుపడుతోంది. లేటెస్ట్‌గా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో నాలుగు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

బస్టాండ్‌లో తేడాగా కనిపించిన ఇద్దరు యువకులు.. ఆపి చెక్ చేయగా..
Ganja

Updated on: Feb 02, 2026 | 10:10 AM

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి బ్యాచ్‌ మాత్రం చెలరేగిపోతూనే ఉంది. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్న ప్రతిసారీ కిలోలకొద్ది గంజాయి పట్టుపడుతోంది. లేటెస్ట్‌గా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో నాలుగు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా బస్టాండ్‌ నుంచి గంజాయి తరలిస్తుండగా పోలీసులు దాడిచేసి.. నాలుగు కిలోల గంజాయ్ ప్యాకెట్లు సీజ్‌చేశారు. ఈ గంజాయిని ఒడిషా బరంపురం నుంచి వనపర్తికి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్‌చేసి.. వాళ్ల నుంచి గంజాను స్వాధీనం చేసుకున్నారు.

అయితే, గంజాయి తరలిస్తున్నట్టుగా పక్కా సమాచారం అందడంతో.. పోలీసులు స్కెచ్ వేశారు.. ఈ క్రమంలోనే తొర్రూర్‌ బస్టాండ్‌ దగ్గర రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులతో ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా? అసలు, ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

వీరు అంతకుముందు కూడా గంజాను తరలించేవారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ దందా వెనుక పెద్ద నెట్‌వర్కే ఉందని అనుమానిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..