Telangana: సమస్య ఎడమ కాలికైతే సర్జరీ కుడి కాలికి చేశాడు.. ప్రైవేటు వైద్యుడి నిర్వాకం.
కొంత మంది వైద్యుల నిర్వాకం రోగుల ప్రాణాల మీదికి తీసుకొస్తుంటాయి. తెలిసో, తెలియకో లేదా నిర్లక్ష్యమో కానీ వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వారి జీవితాలనే ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. తాజాగా ఇలాంటి రెండు సంఘటనలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. ఓ వైద్యుడు ఎడమ కాలికి సమస్య ఉంటే...
కొంత మంది వైద్యుల నిర్వాకం రోగుల ప్రాణాల మీదికి తీసుకొస్తుంటాయి. తెలిసో, తెలియకో లేదా నిర్లక్ష్యమో కానీ వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వారి జీవితాలనే ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. తాజాగా ఇలాంటి రెండు సంఘటనలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. ఓ వైద్యుడు ఎడమ కాలికి సమస్య ఉంటే కుడి కాలికి వైద్యం చేయగా, మరో వైద్యుడి నిర్లక్ష్యంతో డెంగ్యూ బారిన పడిన వ్యక్తి ప్రాణాలే కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కరణ్ ఎం.పాటిల్ అనే అర్థోపెడియన్ వైద్యుడు.. రోగి ఎడమ కాలికి సర్జరీ చేయాల్సి ఉండగా, కుడి కాలికి చేశాడు. రెండు రోజుల తర్వాత తప్పును గుర్తించి మళ్లీ ఎడమ కాలికి సర్జరీ చేశాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఈ విచారణలో వైద్యుడి తప్పుచేసినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో రాష్ట్ర వైద్య మండలి కరణ్ ఎం.పాటిల్ గుర్తింపును 6 నెలల పాటు రద్దు చేసింది. సదరు వైద్యుడి సర్టిఫికెట్‌లను వైద్య మండలికి అందజేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే ఇలాంటి మరో సంఘటన మంచిర్యాలలో జరిగింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం డెంగ్యూతో ఆసుపత్రిలో చేరాడు. అయితే సీహెచ్.శ్రీకాంత్ అనే డాక్టర్ అతన్ని సకాలంలో మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సిఫారసు చేయలేదు. దీంతో రోగి మృతి చెందారు. బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి వైద్యుడి నిర్లక్ష్యాన్ని నిర్ధరించారు. కలెక్టర్ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర వైద్యమండలి విచారణ చేసి శ్రీకాంత్ గుర్తింపును రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గుర్తింపు రద్దుపై 60 రోజుల్లో అప్పీల్ చేసుకునేందుకు ఇద్దరు వైద్యులకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..