Cyberabad Police: తప్పిపోయిన బాలుడు.. గంట వ్యవధిలో ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

ఆడుకుంటూ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిన బాలుడిని గంట వ్యవధిలో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో మూడు సంవత్సరాల వయస్సు ఉన్న హర్షివా ఇంటి నుండి తప్పిపోయాడు.

Cyberabad Police: తప్పిపోయిన బాలుడు.. గంట వ్యవధిలో ఛేదించిన సైబరాబాద్ పోలీసులు
Madhapur Police

Edited By:

Updated on: Apr 13, 2024 | 7:22 PM

ఆడుకుంటూ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిన బాలుడిని గంట వ్యవధిలో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో మూడు సంవత్సరాల వయస్సు ఉన్న హర్షివా ఇంటి నుండి తప్పిపోయాడు. కొండాపూర్ లో ఉన్న వైట్ ఫీల్డ్ రోడ్డులో బాలుడు అయోమయంగా తిరుగుతుండగా, అదే సమయము లో అటుగా వెళుతున్న రాజశేఖర్ అనే వ్యక్తి బాలుడిని గమనించి వివరాలు ఆరా తీశాడు. తాను తప్పిపోయానని వివరాలు సరిగ్గా చెప్పలేకపోయాడు. రోదిస్తున్న ఆ బాలుడిని మాదాపూర్ డీసీపీ ఆఫీసుకు తీసుకు వెళ్లి అప్పగించారు.

దీంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి వినీత్ సూచనల మేరకు.. మాదాపూర్ ఇన్స్‌పెక్టర్ మల్లేష్ తప్పిపోయిన బాలుడి తల్లితండ్రుల వివరాలు సేకరించి, గంట వ్యవధిలో బాలుడిని వారికి అప్పగించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా బాబు తిరిగిన ప్రదేశాన్ని గుర్తించి వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించి బాలుడిని, పోలీసుల దగ్గరకు చేర్చిన రాజశేఖర్‌ను మాదాపూర్ డీసీపీ వినీత్ అభినదించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…