Watch Video: ఆ నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు.. బీజేపీ నేత మురళీధర్‌రావు కౌంటర్

Watch Video: ఆ నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు.. బీజేపీ నేత మురళీధర్‌రావు కౌంటర్

Janardhan Veluru

|

Updated on: Apr 13, 2024 | 6:22 PM

టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత మురళీధర్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీకి పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులే లేరని, బీఆర్ఎస్ నేతలను ఎత్తుకెళుతున్నారని విమర్శించే హక్కు కేటీఆర్‌కు లేదన్నారు.

టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత మురళీధర్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీకి పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులే లేరని, బీఆర్ఎస్ నేతలను ఎత్తుకెళుతున్నారని విమర్శించే హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. బీఆర్ఎస్‌లో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా ? అని ప్రశ్నించారు. అవినీతిలో ఇరుక్కున్న వాళ్లకి వాషింగ్ మెషిన్‌ మాటలే గుర్తొస్తాయంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత విచారణ సరిగ్గానే జరుగుతోందన్నారు. దర్యాప్తు సంస్థలు తప్పు చేస్తే కోర్టుకు వెళ్లొచ్చన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ దొంగలే అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ పేరుతో సెన్సేషన్ చేస్తున్నారని, బీజేపీ గెలుపును అడ్డుకునేందుకే ఈ ప్రయత్నాలు అంటూ మురళీధర్ రావు అన్నారు. మురళీధర్ రావుతో మా కరస్పాండెంట్ నరేశ్ ఫేస్ టు ఫేస్..