Watch Video: సీఎం జగన్‎పై రాళ్లదాడి జరిగిన ప్రాంతంలో దర్యాప్తు.. 30 మీటర్ల మేర క్రైమ్ స్పాట్‎గా నిర్ధారణ..

మేమంతా సిద్దం బస్ యాత్రలో సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానితుల కదలికలపై అరా తీస్తున్నారు పోలీసులు. ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. రాత్రి 8:10 సమయంలో సింగ్ నగర్ గంగనమ్మ గుడీ వద్ద ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించారు. క్యాట్ బాల్ తో దాడి చేయడంతో సీఎం జగన్ ఎడమ కంటిపైన తీవ్రగాయం ఏర్పడింది. దాడి జరిగిన ప్రదేశంలోని స్కూల్ భవనంలో ఇప్పటికే క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టింది.

Watch Video: సీఎం జగన్‎పై రాళ్లదాడి జరిగిన ప్రాంతంలో దర్యాప్తు.. 30 మీటర్ల మేర క్రైమ్ స్పాట్‎గా నిర్ధారణ..

|

Updated on: Apr 14, 2024 | 7:30 AM

మేమంతా సిద్దం బస్ యాత్రలో సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానితుల కదలికలపై అరా తీస్తున్నారు పోలీసులు. ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. రాత్రి 8:10 సమయంలో సింగ్ నగర్ గంగనమ్మ గుడీ వద్ద ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించారు. క్యాట్ బాల్ తో దాడి చేయడంతో సీఎం జగన్ ఎడమ కంటిపైన తీవ్రగాయం ఏర్పడింది.
దాడి జరిగిన ప్రదేశంలోని స్కూల్ భవనంలో ఇప్పటికే క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టింది. అలాగే సీసీ ఫుటేజ్‎ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్ని కోణాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటనకు కారణమైన వారిని త్వరితగతిన గుర్తించాలని విజయవాడ సిపి కు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్‎పై రాళ్ల దాడి జరిగిన ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. రహదారిపై సుమారు 30 మీటర్ల మేర క్రైమ్ స్పాట్‎గా నిర్ధారించారు. ఆ ప్రాంతం మీదుగా వాహనాలు, ప్రజల రాకపోగాలను తాత్కాలికంగా నిషేధించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు, క్లూస్ సేకరిస్తున్నారు. డాగ్ స్వాడ్‎తో అణువణువు తనిఖీలు చేస్తున్నారు. పలువురు అనుమానితులను ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us
Latest Articles